రోజుకి కోటి వ్యాక్సిన్లు.. ఆగస్టు నాటికి సిద్ధం.. ఐసీఎమ్ఆర్

-

కరోనా సెకండ్ వేవ్ విలయ తాండవం చేస్తున్న వేళ ప్రతీ ఒక్కరూ ఎదురుచూస్తున్నది వ్యాక్సిన్ గురించే. భారతదేశ ప్రజలందరికీ వ్యాక్సిన్ వేయాలనీ ప్రభుత్వమూ ఆలోచిస్తోంది. ఈ నేపథ్యంలో మన దగ్గర కొరత ఉన్నందున ఇతర దేశాల వ్యాక్సిన్లను దిగుమతి చేసుకునేందుకు సన్నాహాలు సిద్ధం చేసింది. ఇప్పటికే రష్యా వ్యాక్సిన్ స్పుత్నిక్ వచ్చేసింది. ఇంకా మిగతా వ్యాక్సిన్లు కూడా అందుబాటులోకి రానున్నాయి. ఐతే, భారతదేశ జనాభాకి కావాల్సిన వ్యాక్సిన్లు ఎప్పటిలోగా వస్తాయనే విషయమై అనేక వార్తలు వినిపిస్తున్న నేపథ్యంలో ఐసీఎమ్ఆర్ చెప్పిన దాని ప్రకారం ఆగస్టు నాటికి రోజుకి కోటి వ్యాక్సిన్లు అందుబాటులోకి వస్తాయని తెలుస్తుంది.

ఈ మేరకు ఐసీఎమ్ఆర్ ఛీఫ్ భార్గవ స్పష్టం చేసారు. అంటే మొత్తం జనాభాకి సరిపడా వ్యాక్సిన్లు డిసెంబరు చివరి వరకి వచ్చేస్తాయని, అందువల్ల ఇబ్బంది ఏమీ లేదని తెలిపారు. ప్రస్తుతం కొన్ని కొన్ని రాష్ట్రాల్లో కేవలం సెకండ్ డోసులు మాత్రమే ఇస్తున్నారు. అదీగాక ఫస్ట్ డోస్, సెకండ్ డోస్ మధ్య గ్యాప్ కూడా పెంచిన సంగతి తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Exit mobile version