హను రాఘవపూడి దర్శకత్వంలో వైజయంతి మూవీస్ బ్యానర్ పై అశ్వినీ దత్ నిర్మాతగా తెరకెక్కించిన చారిత్రక ఇతిహాస కథ సీతారామం. యుద్ధంతో రాసిన ప్రేమ కథ.. మలయాళం నటుడు దుల్కర్ సల్మాన్ హీరోగా బాలీవుడ్ బ్యూటీ మృణాల్ ఠాగూర్ హీరోయిన్గా తెలుగులో నటించిన తొలి చిత్రం సీతారామం.. ఇక మొదటి సినిమాతోనే బ్లాక్ బాస్టర్ అందుకున్న ఈ సినిమా దాదాపు కొన్ని కోట్ల రూపాయలను లాభంగా పొందిందట. ఈ సినిమా ద్వారా నిర్మాతలు ఏ రేంజ్ లో లాభాలు అందుకున్నారో ఇప్పుడు చూద్దాం.
ఈ సినిమాలో రష్మిక మందన్న , సుమంత్ , తరుణ్ భాస్కర్ కీలక పాత్రలు పోషించారు. దీనికి విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందించగా , వైజయంతి మూవీస్ బ్యానర్ లో ప్రొడ్యూసర్ అశ్వినీ దత్ ఆయన కుమార్తె స్వప్న దత్ నిర్మించారు. ఈ సినిమా కలెక్షన్స్ విషయానికి వస్తే పూర్తిస్థాయి ప్రేమ కథతో వచ్చిన ఈ సినిమాకి నైజాంలో రూ.4కోట్లు , సీడెడ్ లో రూ.1.50 కోట్లు, ఆంధ్ర లో రూ.6కోట్ల మేర బిజినెస్ చేసుకుంది. ఇక రెస్ట్ ఆఫ్ ఇండియాలో రూ. 70 లక్షలు, ఓవర్సీస్ లో రూ.2.5 కోట్లు, మిగిలిన భాషల్లో రూ.1.50 కోట్లతో కలిపి టోటల్ రూ. 16.20 కోట్ల బిజినెస్ జరిగింది. సున్నితమైన కథతో క్రేజీ కాంబినేషన్లో రూపొందిన ఈ సినిమా అన్ని ఏరియాల్లో కూడా మంచి విజయాన్ని సొంతం చేసుకోవడం జరిగింది.
ప్రస్తుతం ప్రముఖ ఓటీటీ యాప్ అమెజాన్ ప్రైమ్ లో డిజిటల్ స్ట్రీమింగ్ కూడా మొదలైంది . అయినప్పటికీ కూడా కొన్ని ప్రాంతాలలో ఇంకా వసూలను రాబడుతూనే ముందుకు సాగుతోంది ఈ సినిమా. ఇకపోతే ఆరువారాల్లో భారీ వసూళ్లు వచ్చాయి.. మొత్తంగా ఈ సినిమాకు రూ. 28 కోట్ల రూపాయల మేరా లాభం చేకూరినట్లు సమాచారం.