ఎన్డీయేలోకి వైసీపీ… ఎన్ని కేంద్ర మంత్రి ప‌ద‌వులు ఆఫ‌ర్ అంటే..!

-

ఏపీ సీఎం జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డి ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర‌మోడీతో స‌మావేశం అవుతుండ‌డం ఏపీ రాజ‌కీయాల్లోనే కాకుండా జాతీయ రాజ‌కీయాల్లోనూ పెద్ద ఎత్తున చ‌ర్చ‌కు వ‌స్తోంది. ఈ రోజు సాయంత్రం ఢిల్లీ వెళుతోన్న జ‌గ‌న్‌కు రేపు మోడీని క‌లిసేందుకు అపాయింట్‌మెంట్ ఖ‌రారైన‌ట్టు తెలుస్తోంది. మోడీతో భేటీలో ప్ర‌ధానంగా రాష్ట్ర అభివృద్ధి, రాష్ట్రానికి నిధుల విష‌య‌మై ప్ర‌స్తావ‌న‌కు వ‌స్తుంద‌న్న చ‌ర్చ‌లు ఉన్నా.. ఈ భేటీలో రాజ‌కీయంగా కూడా ప్రాధాన్య‌త‌, చ‌ర్చ‌లు ఉంటాయ‌ని జాతీయ మీడియాలో క‌థ‌నాలు వ‌స్తున్నాయి.

రాష్ట్రానికి రావాల్సిన నిధులు, పోల‌వ‌రం ప్రాజెక్టు, మండ‌లి ర‌ద్దు, జీఎస్టీ బ‌కాయిల గురించి చ‌ర్చిస్తార‌ని అంద‌రూ అనుకుంటున్నా మ‌రోసారి అధికారంలోకి రావ‌డ‌మే టార్గెట్‌గా పెట్టుకున్న బీజేపీ వైఎస్సార్‌సీపీని ఎన్డీయేలోకి ఆహ్వానించే అంశం కూడా ప్ర‌ధానంగా చ‌ర్చ‌కు రానుంద‌ని తెలుస్తోంది. ఇక మోడీ నుంచి వైఎస్సార్‌సీపీకి కేంద్ర మంత్రి ప‌ద‌వులు కూడా ఆఫ‌ర్ చేసే అంశం చ‌ర్చ‌కు రానుందంటున్నారు. ఇప్పటికే బీజేపీ జాతీయ వ‌ర్గాల నుంచి ఈ అంశంపై జ‌గ‌న్‌కు స‌మాచారం రావ‌డంతోనే జ‌గ‌న్ హుటాహుటీన ఢిల్లీ బ‌య‌లుదేరి వెళుతున్నార‌ని అంటున్నారు.

ప్ర‌ధాని మోడీ జ‌గ‌న్‌తో ఓపెన్‌గానే ఈ అంశంపై చ‌ర్చించ‌బోతున్న‌ట్టు కూడా జాతీయ మీడియా ఊదేస్తోంది. బీజేపీ జాతీయ వ‌ర్గాల వినిపిస్తోన్న క‌థ‌నం ప్ర‌కారం రెండు కేబినెట్ ప‌ద‌వుల‌తో పాటు ఓ స‌హాయ మంత్రి ప‌ద‌వి వైసీపీకి ఇస్తార‌ని అంటున్నారు. వైసీపీకి లోక్‌స‌భ‌లోనే 22 మంది ఎంపీలు ఉన్నారు. ఇక రాజ్య‌స‌భ స‌భ్యులు వీటికి అద‌నం. ఇక వ‌చ్చే నాలుగేళ్లలో ఏపీకి ఎన్ని రాజ్య‌స‌భ ప‌ద‌వులు వ‌చ్చినా అవ‌న్నీ వైఎస్సార్‌సీపీ ఖాతాలోనే ప‌డ‌నున్నాయి.

ఇటు ఎన్డీయే నుంచి శిరోమ‌ణి అకాళీద‌ల్‌, శివ‌సేన లాంటి న‌మ్మ‌క‌మైన మిత్ర‌ప‌క్షాలు ఇప్ప‌టికే బ‌య‌ట‌కు వెళ్లాయి. ఇక జేడీయూ సైతం ఎన్డీయేలో ఉంటుందో ?  లేదో ?  తెలియ‌దు. ఈ ప‌రిస్థితుల్లో తిరుగులేని బ‌లంతో ఉన్న వైఎస్సార్‌సీపీని ఎన్డీయేలోకి తీసుకుంటేనే మంచిద‌న్న నిర్ణ‌యంతో బీజేపీ జాతీయ నాయ‌క‌త్వం ఉంది. ప్ర‌స్తుతం ఏపీలో జ‌న‌సేన‌తో బీజేపీ ఉన్నా ఆ పార్టీతో క‌లిసున్నా లేక‌పోయినా ఉప‌యోగం లేద‌న్న నిర్ణ‌యానికి బీజేపీ వ‌చ్చింది. అందుకే ఇప్పుడు వైసీపీతో జ‌ట్టుక‌ట్టేందుకు రెడీ అవుతోన్న‌ట్టు తెలుస్తోంది. ఈ క్ర‌మంలోనే చంద్ర‌బాబు, లోకేశ్‌పై  సీబీఐ దర్యాప్తు కోరుతున్న జగన్ ఈ అంశాన్ని కూడా ఎన్డీయే చేరిక అంశంలో ముడిపెడ‌తార‌ని టాక్‌..?

అంటు అటు కేంద్ర ప్ర‌భుత్వంతో చేర‌డంతో పాటు ఇటు టీడీపీని మ‌రింత చావు దెబ్బ కొట్ట‌డం, అటు జ‌న‌సేన‌ను బీజేపీకి దూరం చేయ‌డం.. ఇలా బ‌హ‌ముఖ ప్ర‌యోజ‌నాల‌తో జ‌గ‌న్ ప్లాన్ ముడిప‌డి ఉండే ఛాన్సులు ఉన్నాయి. మ‌రి జ‌గ‌న్ డెసిష‌న్ ఈ విష‌యంలో ఎలా ?  ఉంటుందో ?  చూడాలి.

-vuyyuru subhash 

Read more RELATED
Recommended to you

Exit mobile version