పీఆర్పీ ఓటమిలో కీలక పాత్ర నాదే..మాజీ ఎంపీ సంచలన కామెంట్స్…!

-

మెగా స్టార్ చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీ తన వల్లే ఓడిపోయిందంటూ సంచలన కామెంట్స్ చేశారు కాంగ్రెస్ మాజీ ఎంపీ హర్షకుమార్.గోదావరి జిల్లాలో బలహీనవర్గాలకు పీఆర్పీ సరైన ప్రాధాన్యం ఇవ్వలేదని అందుకే ఈ జిల్లాల్లో వెనుకబడిందన్నారు.గోదావరి జిల్లాల్లో మంచి పట్టున్న తాను ఎంపీగా అన్ని వర్గాలను కలుపుకుని వెళ్లి కాంగ్రెస్ పార్టీ విజయలో కీలక పాత్ర పోషించనన్నారు హర్షకుమార్.

ఇక చిరంజీవి సోదరుడు పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేన పార్టీలో చేరదామనుకున్నాని అప్పటికే తన వర్గంలో చాలామందిని జనసేనలోకి పంపించానని హర్ష కుమార్ చెప్పారు. నన్ను పార్టీలోకి ఆహ్వానించడానికి ఆ పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణే వస్తారని తనకు తెలిసిందని, కానీ ఆయనకు ఏమైందో ఏమో తన వద్దకు రాలేదన్నారు. పవన్ కల్యాణ్ ఇన్‌సెక్యూరిటీ ఫీలింగ్ ఎక్కువన్నారు. ఓ ప్రైవెట్ చానల్ కి ఇచ్చిన ఇంటర్యూలో హర్షకుమార్ ఈ వ్యాఖ్యలు చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version