మోహన్ రాజాకి చిరంజీవిని డైరెక్ట్ చేసే అవకాశం ఎలా వచ్చిందో తెలుసా..?

-

మెగాస్టార్ చిరంజీవి ఆచార్య సినిమాతో పాటు మరో రెండు సినిమాలని లైన్లో పెట్టాడు. కొరటాల శివ దర్శకత్వంలో రూపొందే ఆచార్య సినిమా పూర్తికాగానే లూసిఫర్ తెలుగు రీమేక్ మొదలవనుంది. ఐతే ఈ సినిమా విషయంలో జరిగిన చర్చ చాలా ఆసక్తికరంగా మారింది. మొదటగా ఈ సినిమాని సాహో దర్శకుడు సుజిత్ తెరకెక్కిస్తాడని అన్నారు. ఆ తర్వాత వివి వినాయక్ చేతుల్లోకి వెళ్ళిందన్నారు. మళ్ళీ వినాయక్ ని కాదని ప్రస్తుతం మోహన్ రాజా చేతికి వెళ్ళింది.

ఐతే మోహన్ రాజాకి చిరంజీవి డైరెక్ట్ చేసే అవకాశం ఎలా వచ్చిందనేది అందరూ చర్చించుకుంటున్నారు. ఐతే లూసిఫర్ తెలుగు రీమేక్ లో మోహన్ రాజా భారీ మార్పులు చేసాడట. ఒరిజినల్ సినిమాలో మోహన్ లాల్ పక్కన హీరోయిన్ లేదు. కానీ ఈ సినిమాలో చిరంజీవి పక్కన హీరోయిన్ ఉంటుందట. అలాగే మూడు పాటలు కూడా ఉంటాయట. అంతే కాదు ఒరిజినల్ మూవీ చాలా సీరియస్ గా సాగుతుంది. కానీ లూసిఫర్ రీమేక్ లో కాస్తంత ఫన్ కలిగించే సీన్లని యాడ్ చేస్తున్నారట. ఇన్ని మార్పులు చేస్తున్నారు కాబట్టే మోహన్ రాజాకి అవకాశం వచ్చిందని చెప్పుకుంటున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version