కరోనా కారణంగా ఇంట్లో నుండి బయటకి వెళ్లాలంటేనే భయపడుతున్నారు. తొమ్మిది నెలలుగా ఇబ్బంది పెడుతున్న వైరస్ ప్రభావం ఇప్పుడిప్పుడే కొద్దిగా తగ్గుతుంది. ఐతే ఇలా తగ్గుతుందని అనుకునేలోపే కరోనా కొత్త రూపం అంటూ మళ్లీ వచ్చింది. ఆ కొత్తరూపం ఇండియాకి వచ్చిందో లేదో తెలియదు గానీ, కరోనా వల్ల పనులన్నీ ఇంట్లోనే జరిగిపోతున్నాయి. సాధారణ సమయంలో ఏదైనా పని చేసుకోవడానికి బయటకి వెళ్లే వాళ్ళు కూడా ఆ పని ఇంట్లోనే కూర్చుండి ఎలా చేసుకోవచ్చో తెలుసుకుంటున్నారు.
ఈ నేపథ్యంలో వైద్యం కూడా ఇంట్లోనే జరిగిపోతుంది. ప్రస్తుతం చాలామంది డాక్టరుని సంప్రదించాల్సి వస్తే హాస్పిటల్ వెళ్ళడం తగ్గించేసారు. ముఖ్యంగా యాభైకి పైబడ్డ వయసుగల వారు ఈ విషయంలో కఠినంగా ఉంటున్నారట. ఈ ఏడాది దాదాపుగా 502శాతం పెరిగిందట. వృద్ధులకి కరోనా వైరస్ చాలా తొందరగా వ్యాపిస్తుందని వార్తలు వస్తున్నందున హాస్పిటల్ కి బయటకి వెళ్ళడానికి ఇష్టపడట్లేదు. ఐతే ముందు ముందు రోజుల్లో ఇది మరింత పెరిగే అవకాశం ఉంది.