ప్రపంచ దేశాల ముందు తలెత్తుకునేలా చేసిన వీరుడు నీరజ్ చోప్రా. ఆయన టోక్యో ఒలంపిక్స్‌లో గోల్డ్ మెడల్ తీసుకురావడంతో ఒక్కసారిగా ఆయన నేషనల్ స్టార్ అయిపోయాడు. బల్లెం వీరుడిగా ఆయన రికార్డులు నమోదు చేశాడు. ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా గూగుల్ లో నీరజ్ కోసం తెగ వెతికేస్తున్నారు. మరి ఆయన గోల్డ్ మెడల్ కొట్టడం వెనక ప్రభుత్వ ప్రోత్సాహం ఏ మేరకు ఉందో తెలుసుకుందాం.
ఇక రీసెంట్‌గా స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఈ విషయంపై క్లారిటీ ఇచ్చేసింది. ఇక స్పోర్ట్స్ అథారిటీ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం నీరజ్ టోక్యోలో ఒలింపిక్స్ ఆడడానికి ముందు ఆయన 450 రోజుల దాకా జావెలిన్ త్రో శిక్షణ తీసుకునేందుకు వివిధ దేశాల్లో పర్యటించి ఎంతో ప్రావీణ్యం పొందాడని సమాచారం.
ఇక ఈ విధంగా ఆయన వివిధ దేశాల్లో ట్రైనింగ్ తీసుకోవడానికి ఏకంగా కేంద్ర ప్రభుత్వం 4.85 కోట్లను ఖర్చు పెట్టిందని తెలుస్తోంది. అయితే ఇది ఒక్క విభాగానికి కాకుండా నీరజ్ వ్యక్తిగతంగా కూడా ఖర్చు పెట్టిందని సమాచారం. దాదాపుగా 2017 నుంచి ఇప్పటి వరకు నీరజ్ చోప్రా మీద ఈ మొత్తాన్ని కేంద్రం ఖర్చు చేసిందని స్పోర్ట్స్ అతారిటీ వెల్లడించింది.