బడ్జెట్ లో ఏయే రంగానికి ఎంత కేటాయించారు…?

-

కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ ని పార్లమెంట్ లో ప్రవేశ పెట్టారు. ఈ ఈ సందర్భంగా ఆమె రైతులు, విద్యార్ధులు, వైద్య రంగం, ఇలా అనేక రంగాలకు పెద్ద పీట వేసారు. అలాగే వెనుకబడిన వర్గాలకు భారీగా నిధులు కేటాయించారు. అదే విధంగా అభివృద్దికి సంబంధించి కూడా నిర్మల భారీగా నిధులు కేటాయించారు. ఒకసారి ఏయే రంగానికి ఎన్ని నిధులు కేటాయించారో చూస్తే

వ్యవసాయానికి 2.38 లక్షల కోట్లు, స్వచ్చ భారత్ 12,300 కోట్లు, ఆరోగ్యానికి 68 వేల కోట్లు, పరిశ్రమలకు 27300 కోట్లు, విద్యకు 99, 300 కోట్లు, దివ్యా౦గులకు ,9,500 కోట్లు, టూరిజం ప్రమోషన్ కి 2,500 కోట్లు, జమ్మూ కాశ్మీర్ కి 3౦,757 కోట్లు, ఎస్సీలకు 85 వేల కోట్లు, సీనియర్ సిటిజన్లకు 9, 500 కోట్లు, సాంస్కృతిక శాఖకు 315౦ కోట్లు, క్లీన్ ఎయిర్ కి 4,400 కోట్లు కేటాయించారు.

విద్యుత్ రంగానికి 22 వేల కోట్లు, బెంగళూరు రైలు ప్రాజెక్ట్ కి 18,700 కోట్లు, గ్రామీణాభివృద్ధికి 1.23 లక్షల కోట్లు, ప్రభుత్వ బ్యాంకులకు 3 లక్షల కోట్ల మూలధనం, లాడాక్ కి, 5,958 కోట్లు, జల్ జీవన్ మిషన్ కి 3,60 లక్షల కోట్లు, రవాణా రంగానికి 1,70 లక్షల కోట్లు, ఎస్టీలకు 57, 300 కోట్లు, ఆయుష్మాన్ భావ కార్యక్రమానికి 6 వేల కోట్లు, మహిళా సంక్షేమానికి 28,600 కోట్లు కేటాయించారు.

వ్యవసాయ, విద్య, వైద్య రంగాల విషయ౦లో నిర్మలమ్మ కాస్త పెద్ద మనసు చూపించారు. వెనుకబడిన వర్గాల కోసం భారీగా నిధులు కేటాయించారు నిర్మల. రైల్వే, జల రవాణా, రోడ్డు రవాణాకు ఈ బడ్జెట్ భారీగానే నిధులు ఇచ్చింది. ఇక ఎల్ఐసిని ప్రైవేటీ కరణ చేయడం ఈ బడ్జెట్ లో ఒక సంచలనంగా చెప్పుకోవచ్చు. కొత్త టాక్స్ స్లాబులను నిర్మల ప్రకటించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version