ఒత్తిడిని దూరం చేసే అద్భుతమైన చిట్కాలు…

-

ప్రస్తుత పరిస్థితుల్లో ఒత్తిడి కామన్ అయిపోయింది. నాకు స్ట్రెస్ ఉన్నదని చెప్పుకోవడం గొప్పగా మారింది. అసలు స్ట్రెస్ లేదని చెప్తే అసలు పనిచేస్తున్నారా లేదా అనే ప్రశ్నలు అడిగేవాళ్ళున్నారు. ఉద్యోగ రీత్యా, భార్యాభర్తల సంబంధాల్లో, బయటి వారితో వచ్చే ఇబ్బందులు, స్నేహితులు, వ్యాపారాలు మొదలగు విషయాల్లో ఒత్తిడి ఎదుర్కొంటున్నారు. పైన బరువుంటేనే గమ్యానికి తొందరగా చేరగలుగుతాం కాబట్టి ఒత్తిడి మంచిదే అని చెబుతారు గానీ, ఒత్తిడి పెంచుకుంటూ ఆరోగ్యాన్ని పాడుచేసుకుని, ఎన్ని గమ్యాలు చేరుకున్నా ఏం లాభం ఉంటుందన్నది అసలు ప్రశ్న.

గమ్యం చేరుకునే సమయంలో చేసే పనిని ఆస్వాదించగలగాలి. అలాగే గమ్యం చేరుకున్నా ఆ ఆనందం మరింత రెట్టింపవ్వాలి. అలా కాదు అవతలి వారికోసం పనులు చేస్తూ, పరువు కోసం ప్రాకులాడుతూ అనవసర ఒత్తిడి ఎదుర్కోవడం కరెక్ట్ కాదు. ఐతే ఈ ఒత్తిడిని ఎలా దూరం చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

దేనివల్ల మీరు ఒత్తిడిగా ఫీల్ అవుతున్నారో ఒక దగ్గర రాసుకోండి. ఆ ఒత్తిడి ని క్రియేట్ చేసే మూల కారణం అన్వేషించండి. ఉద్యోగంలో మీ ఒత్తిడికి మీ బాస్ కారణమయితే, అక్కడ సరిచూసుకోవాల్సి ఉంటుంది. మీ పనిలో నిజంగా తప్పులుంటే వాటిని సరిదిద్దుకునేందుకు ప్రయత్నించండి. లేదు అన్ని పనులు సక్రమంగా చేస్తున్నా అనవసరంగా ఒత్తిడి పెంచుతున్నారంటే, మీపై ఎక్కువ భారం పడుతుందన్న విషయం మీ బాస్ కి తెలిసేలా చేయండి.

ఐతే ఇలాంటివి అంత తేలిగ్గా ఒక పట్టాన తెగవు. అలాంటప్పుడు ప్రశాంత వాతావరణంలోకి వెళ్ళి ఆలోచించాలి. సూర్యోదయం పూట పార్కులో ఒక్కరే అలా నడుస్తూ వెళుతుంటే ప్రకృతి ఇచ్చే రిలాక్సేషన్ అంతా ఇంతా కాదు.

ప్రతిరోజూ వ్యాయామం, ధ్యానం మన మనసును తేలిక పరుస్తాయి. ఏ విషయానికి ఎంత ఆలోచించాలి, ఏది మనసు దాకా తీసుకోవాలి, దేన్ని దూరం పెట్టాలి అనేది అర్థం అవుతుంది.

మీ మనసు అస్సలు బాగాలేనపుడు, మీ మెదడు హీట్ ఎక్కిపోయిందని మీకు అనిపించినపుడు స్నానం చేయండి, నీరు చేతికి తగలగానే ఒత్తిడి పూర్తిగా దూరమవుతుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version