జూ పార్క్ జంతువులకు ఆహారం ఎలా…?

-

కరోనా వైరస్ దెబ్బ చాలా మందికి తగిలింది. కోట్ల మంది ప్రజలు దీని కారణంగా ఇబ్బంది పడుతున్నారు. లాక్ డౌన్ దెబ్బకు ప్రజలు ఎవరూ కూడా బయటకు రావడం లేదు. దీని వలన అన్ని రంగాలు కూడా తీవ్రంగా ఇబ్బంది పడుతున్నాయి అనేది వాస్తవం. దేశ వ్యాప్తంగా దారుణమైన పరిస్థితులు ఇప్పుడు నెలకొన్నాయి అనేది వాస్తవం. తాజాగా లాక్ డౌన్ దెబ్బ అడవి జంతువులకు కూడా తగిలింది.

యూపీలోని ఘాజీపూర్ వద్ద నున్న స్లాటర్ హౌస్ ని లాక్ డౌన్ కారణంగా మూసి వేయడంతో జూ పార్కులోని జంతువులకు ఆహారం లేదు. ఢిల్లీ నుంచి మాంసం ఎగుమతి చేసే అవకాశం లేదు. దీంతో ఘాజిపూర్ స్లాటర్ హౌస్ తిరిగి తెరిచేందుకు అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. దీనితో పదుల సంఖ్యలో జంతువులు మరణించే అవకాశం ఉందని అంటున్నారు. తూర్పు ఎంసిడి అధికారులు ఇప్పుడు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు.

జూలోని జంతువులకు, మాంసం వ్యాపారులకు సమస్యలు తలెత్తాయి. స్లాటర్ హౌస్ లో ప్రతిరోజూ సుమారు 5 వేల జంతువులను వధించి ఆ తర్వాత మాంసాన్ని జు పార్క్ లకు పంపిస్తూ ఉంటారు. ఇప్పుడు ఆగిపోతే ఇబ్బందులు ఎదురు అవుతాయి. స్లాటర్ హౌస్ తెరిస్తే కరోనా ఇబ్బంది వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఇప్పుడు అధికారులు ఎం చెయ్యాలో అర్ధం కాని స్థితిలో ఉన్నాయి. బయటి రాష్ట్రాల నుంచి భారీగా జంతువులు వస్తూ ఉంటాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version