హైప్రోటీన్స్ ఉండే చికెన్ సూప్

-

ఈ వర్షాకాలంలో చికెన్ కూర తినడం కంటే సూప్ తాగడం మంచిది. ఈ సూప్‌ను పిల్లలకు పెడితే లొట్టలేసుకొని తింటారు. హైప్రోటీన్లు ఉండే చికెన్ తీసుకోవడం వల్ల శరీరంలో కండరాలు బలంగా ఉంటాయి. అందుకే వారినికి రెండుసార్లు అయినా సూప్ తాగేలా చూసుకోండి.

కావాల్సినవి :
బోన్‌లెస్ చికెన్ : పావుకిలో
పాలకూర తరుగు : 1 కప్పు
క్యారెట్ తరుగు : పావు కప్పు
చక్కెర : 1 టీస్పూన్
మిరియాల పొడి : చిటికెడు
అజినమోటో : చిటికెడు
ఉల్లికాడల తరుగు : 2 టీస్పూన్లు
బీన్స్ తరుగు : పావు కప్పు
వెల్లుల్లి తరుగు : 1 టీస్పూన్
పచ్చిమిర్చి : తరుగు : 1 టీస్పూన్
కార్న్‌ఫ్లోర్ : 1 టీస్పూన్
నూనె : 1 టీస్పూన్
ఉప్పు : తగినంత.

తయారీ :
ముందుగా చికెన్ శుభ్రం చేసి పెట్టుకోవాలి. తర్వాత చికెన్ మునిగేంత వరకు నీళ్లు పోసి ఉడికించి పక్కన పెట్టుకోవాలి. కడాయిలో నూనె పోసి క్యారెట్, బీన్స్, వెల్లుల్లి, పచ్చిమిర్చి తరుగు వేసి రెండు నిమిషాల తర్వాత చికెన్ ఉడికించిన నీళ్లు, చక్కెర, ఉప్పు, పాలకూర తరుగు, మిరియాల పొడి వేసి పదినిమిషాలు ఉడికించి స్టౌపై నుంచి దించేయాలి. చివరిగా ఆజినమోటో వేసి హాట్ హాట్‌గా సర్వ్ చేసుకొని తాగితే రుచిగా ఉంటుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version