తన భార్యతో క్లోజ్ గా ఉంటున్నాడని.. ఆ మొగుడు ఏం చేశాడంటే..?

-

నేర వార్తల్లో చాలా వరకూ అక్రమ సంబంధం కారణంగానే తలెత్తుతుంటాయి. హైదరాబాద్ లో ఇలాంటి అక్రమ సంబంధం విషయంలో ఓ వ్యక్తి ఏకంగా మరో వ్యక్తిని కొట్టి చంపేశాడు. వివరాల్లోకి వెళ్తే.. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలానికి చెందిన రవి తన భార్య, కుమారుడితో కలిసి పొట్టకూటి కోసం నగరానికి వచ్చారు. ఎల్బీనగర్ పరిధి కొత్తపేటలోని బాలాజీనగర్లో ఉంటున్నాడు.

సంగారెడ్డి జిల్లా ఝరాసంగం మండలం మాచనూరు గ్రామానికి చెందిన పాతికేళ్ల ప్రణీత్ రెడ్డి నగరానికి తరచూ వచ్చి వెళ్తుంటాడు. ఇతడికి రవి భార్య చిన్నప్పుడు క్లాస్ మేట్.. ఆ పరిచయంతో తరచూ రవి ఇంటికి ప్రణీత్ రెడ్డి వచ్చేవాడు.. అలా అలా ప్రణీత్ రెడ్డికి రవి భార్యతో అక్రమ సంబంధం ఏర్పడింది.

ఈ విషయం తెలుసుకున్న రవి భార్యను వారించాడు. ఆ తర్వాత కూడా ప్రణీత్ రెడ్డి రవి ఇంటికి రావడం మానలేదు. దీంతో కోపోద్రిక్తుడైన రవి.. ఈసారి ఇద్దర్నీ రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవాలని ప్లాన్ వేశాడు. సోమవారం ప్రణీత్ రెడ్డి మరోసారి ఆమె ఇంటికి వచ్చాడు. ఆ సమయంలో రవి ఇంటి బయటే కాపుకాశాడు. ప్రణీత్ రెడ్డి ఇంట్లోకి వెళ్లగానే అతను కూడా వెళ్లి.. ఇద్దరినీ నిలదీశాడు.

భార్యను, మూడేళ్ల కొడుకును బయటకు పంపించి.. కర్రతో ప్రణీత్ రెడ్డి పై దాడి చేశాడు. కోపంతో విపరీతంగా కొట్టడంతో తీవ్రగాయాలతో ప్రణీత్ రెడ్డి అక్కడికక్కడే చనిపోయాడు. ఆ తర్వత రవి నేరుగా చైతన్యపురి పోలీస్ స్టేషన్‌ కు వెళ్లి లొంగిపోయాడు. ఇలా అక్రమ సంబంధం ఓ వ్యక్తి నిండు ప్రాణాన్ని బలితీసుకుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version