శ్రీముఖి లేస్టెస్ట్ మూవీ ‘ఇట్స్ టైమ్ టు పార్టీ’ ఫస్ట్ లుక్ ..!

-

బుల్లితెర యాంకర్స్ సిల్వర్ స్క్రీన్ మీద తమ సత్తా చాటాలని తెగ తాపత్రయపడుతున్నారు. ఒక్కొక్కరు వెండితెర మీద స్టార్ గా వెలగాలని ప్రయోగాలకి సిద్దమవుతున్నారు. అంతక ముందు రష్మి గుంటూరు టాకీస్ తో పాటు మరో సినిమాలోను హీరోయిన్ గా నటించింది. మంచి పేరే వచ్చింది. కాని ఎందుకనో వరసగా అవకాశాలు దక్కలేదు. ఇక అనసూయ మంచి క్యారెక్టర్స్ తో ఆకట్టుకుంటుంది. సుధీర్ కూడా హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. అలాగే ప్రదీప్ మాచి రాజు 30 రోజుల్లో ప్రేమించడం ఎలా అనే సినిమాతో హీరోగా ఎంట్రీ ఇవ్వడానికి సిద్దంగా ఉన్నాడు.

 

ఈ లిస్ట్ లో ప్రముఖ యాంకర్ శ్రీముఖి కూడా జాయిన్ అయ్యారు. ఇంతకముందు చిన్న చిన్న క్యారెక్టర్స్ పోషించిన శ్రీముఖి ఇప్పుడు హీరోయిన్ గా రాబోతోంది. ‘ఇట్స్ టైమ్ టు పార్టీ’ అన్న సినిమాలో నటిస్తున్న శ్రీముఖి తన బర్త్ డే సందర్భంగా సినిమాలో తన లుక్ ని రిలీజ్ చేశారు చిత్ర యూనిట్. గౌతమ్ ఇ.వి.ఎస్ ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. దితిప్రియ భట్టాచార్య, మాయ నెల్లూరి, క్రిష్ సిద్దిపల్లి, బాషా మొహిద్దిన్ షేక్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఎయిన్స్ మోషన్ పిక్చర్స్, కాక్ టైల్ సినిమాస్ పతాకంపై అల్లం సుభాష్, గౌతమ్ ఇ.వి.ఎస్ నిర్మించారు.

సైబర్ క్రైమ్ థ్రిల్లర్ బ్యాగ్డ్రాప్ లో రూపొందిన ఈ సినిమా కేవలం నాలుగు పాత్రల చుట్టూ కథ సాగుతుండటం విశేషం. ప్రస్తుతం సమాజంలో యువతరం జీవితాలకు సంబంధించిన ఆసక్తికరమైన అంశాలను ఈ సినిమాలో చూపించనున్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమా రిలీజ్ డేట్ ను త్వరలో ప్రకటించనున్నారట చిత్ర యూనిట్.

Read more RELATED
Recommended to you

Exit mobile version