ఈ మధ్య చాలా మంది ఆన్‌లైన్‌లోనే బంగారం కొనేస్తున్నారు. అదేనండి డిజిటల్ గోల్డ్. ఎవరైనాసరే ఆన్‌లైన్‌లో బంగారం ని కొనుకోచ్చు. అలానే విక్రయించొచ్చు. అదే మనం బయట అయితే పెట్టిన రేటు రాకపోవచ్చు. కానీ ఇక్కడ మాత్రం అలా కాదు. ఆరోజు మార్కెట్ రేటు మీకు వస్తుంది. అందుకనే ఈ మధ్య చాలా మంది బంగారం ఆన్‌లైన్ లో కొంటున్నారు. అయితే అసలు మరి డిజిటల్ గోల్డ్ అంటే ఏమిటి అనేది చూద్దాం.
డిజిటల్ గోల్డ్ అనేది ఆన్‌లైన్ గోల్డ్ ఇన్వెస్ట్‌మెంట్ ఆప్షన్. మీరు ఆన్‌లైన్‌లో బంగారం కొనుకోచ్చు. ఇది 24 క్యారెట్స్ బంగారమే. ఆన్‌లైన్‌లో బంగారం కొన్న తర్వాత మీరు చెల్లించిన మొత్తానికి సమానమైన బంగారం మీ వాలెట్‌లోకి క్రెడిట్ అవుతుంది. మీరు మీ గోల్డ్ ని పొందాలంటే గోల్డ్ కాయిన్ లేదా బంగారు బిస్కెట్ల రూపంలో డెలివరీ అవుతుంది.
పేటీఎం, గూగుల్ పే, ఫోన్ పే వంటి వాటి ద్వారా కూడా గోల్డ్ ని కొనచ్చు. ఇక గూగుల్ పే ప్రకారం చూస్తే.. గూగుల్ పే నుండి కూడా మీరు 24 క్యారెట్ల డిజిటల్ గోల్డ్ కొనొచ్చు. ఎంఎంటీసీ పీఏఎంపీ ద్వారా మీకు బంగారం లభిస్తుంది. గోల్డ్ లాకర్ ఆప్షన్ కూడా దీనిలో ఉంటుంది. దీనితో మీరు ట్రాన్సాక్షన్లను చెక్ చేసుకోవచ్చు. ఇక గూగుల్ పే ద్వారా ఎలా కొనచ్చు అనేది చూస్తే..
ముందుగా గూగుల్ పే యాప్‌లోకి వెళ్లాలి.
తర్వాత సెర్చ్ బార్‌లో గోల్డ్ లాకర్ అని టైప్ చెయ్యండి.
గోల్డ్ లాకర్ ఆప్షన్ ఉంటుంది క్లిక్ చేయాలి.
ఇప్పుడు మీరు మార్కెట్ రేటు కనిపిస్తుంది.
కొనిన 5 నిమిషాల వరకు అదే రేటు లాక్ అవుతుంది.
బంగారం ధర రోజంతా మరుతూ ఉంటుంది. స్థిరంగా ఉండదు.
ఇప్పుడు మీరు అమౌంట్ ని ఎంటర్ చేయాలి.
తర్వాత పేమెంట్ చెయ్యాలి.
రోజుకు రూ.50 వేల లిమిట్ ఉంటుంది.
రూ.49,999 కన్నా ఎక్కువ కొంటె కేవైసీ వివరాలు ఎంటర్ చెయ్యాలి.
గూగుల్ పే ద్వారా బంగారం విక్రయం ఎలా అంటే..?
ముందు మీరు గోల్డ్ లాకర్‌లోకి వెళ్లాలి.
అక్కడ సెల్ ఆప్షన్ ఉంటుంది. దీనిపై క్లిక్ చెయ్యండి.
మీరు బంగారం విక్రయించాలి.
మీరు బంగారం విక్రయించేటప్పుడు గోల్డ్ రేటు 8 నిమిషాలు లాక్ అవుతుంది చూసుకోండి.
ఎంత బంగారం విక్రయించాలో మీరు ఆ డీటైల్స్ ని ఎంటర్ చేయాలి.
అంతే అమౌంట్ మీ అకౌంట్ లో పడతాయి.