ఇంట‌ర్నెట్ లేదా.. అయినా స‌రే యూపీఐ ద్వారా ఇలా పేమెంట్ చేయ‌వ‌చ్చు..!!

-

ఇంట‌ర్నెట్ అనేది ప్ర‌స్తుతం చాలా మందికి నిత్యావ‌స‌ర వ‌స్తువుగా మారింది. ఇంట‌ర్నెట్ లేకుండా ఏ ప‌ని జ‌ర‌గ‌డం లేదు. ప్ర‌తి ఒక్క‌రూ ఫోన్ల‌లో ఇంటర్నెట్‌ను విరివిగా ఉప‌యోగిస్తున్నారు. అయితే ఇంట‌ర్నెట్ సౌక‌ర్యం లేని చోట కొంత ఇబ్బందిగానే ఉంటుంది. సిగ్న‌ల్ స‌రిగ్గా రాక‌పోతే ఇంట‌ర్నెట్ రాదు. దీంతో ఏ ప‌నీ చేయ‌లేం.

ఇంట‌ర్నెట్ లేని చోట పేమెంట్లు చేయాల‌న్నా ఇబ్బందిగానే ఉంటుంది. యూపీఐ ద్వారా పేమెంట్లు చేసేందుకు ఇంట‌ర్నెట్ అవ‌స‌రం అవుతుంది. అయితే ప్ర‌స్తుతం ఇంట‌ర్నెట్ లేకుండానే యూపీఐ ద్వారా పేమెంట్లు చేయ‌వ‌చ్చు. అందుకు ఏ స్టెప్స్‌ను పాటించాలో ఇప్పుడు తెలుసుకుందాం.

ఇంటర్నెట్ లేకుండా యూపీఐ ద్వారా ఇలా పేమెంట్ చేయ‌వ‌చ్చు.

1. మీ ఫోన్‌ను తీసుకుని అందులో డ‌య‌ల‌ర్‌ను ఓపెన్ చేసి *99#ను డ‌య‌ల్ చేయండి.

2. త‌రువాత అనేక ఆప్ష‌న్లు వ‌స్తాయి. వాటిల్లో 1వ ఆప్ష‌న్‌ను ఎంచుకుని అనంత‌రం సెండ్‌పై ట్యాప్‌ చేయాలి.

3. మీరు పేమెంట్ చేయాల్సిన వ్య‌క్తికి చెందిన మొబైల్ నంబ‌ర్‌ను ఎంట‌ర్ చేసి త‌రువాత పంపించాల్సిన మొత్తానికి చెందిన సంఖ్య‌ను న‌మోదు చేయాలి.

4. త‌రువాత యూపీఐ పిన్‌ను ఎంట‌ర్ చేయాలి. దీంతో ఆ మొత్తం అవ‌తలి వ్య‌క్తికి చేరుతుంది.

అయితే ఇంట‌ర్నెట్ లేకుండా ఇలా యూపీఐని వాడుకోవాలంటే మీ అకౌంట్ క‌చ్చితంగా ఫోన్ నంబ‌ర్‌కు లింక్ అయి ఉండాలి. దానికి లింక్ అయి ఉన్న అకౌంట్ నుంచి డ‌బ్బులు పంప‌బ‌డ‌తాయి. అవ‌త‌లి వ్య‌క్తి ఫోన్ నంబ‌ర్ కూడా యూపీఐ ద్వారా బ్యాంక్ అకౌంట్‌కు లింక్ అయి ఉండాలి. దీంతో ఆ మొత్తం చేరుతుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version