HTC Desire 22 Pro స్మార్ట్‌ ఫోన్.. ఫీచర్స్‌ ఇవే..!

-

తైవాన్ టెక్‌ దిగ్గజం.. HTC మెటావర్స్ ఆధారిత మొబైల్‌ను విడుదల చేసింది. ఈ ఫోన్ డస్ట్ రెసిస్టెన్స్, వాటర్ రెసిస్టెన్స్. HTC Desire 22 pro పేరుతో ఫోన్‌ మార్కెట్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. ఇది ఒక లగ్జరీ స్మార్ట్‌ ఫోన్‌ అనే చెప్పాలి. ఫోన్‌ కాస్ట్‌, ఫీచర్స్‌ ఇలా ఉన్నాయి.

HTC Desire 22 Pro స్మార్ట్‌ఫోన్ ధర..

గ్లోబల్ మార్కెట్‌లో HTC Desire 22 Pro స్మార్ట్‌ఫోన్ ధర $404గా ఉంది. అంటే ఇండియన్‌ కరెన్సీలో సుమారు రూ. 32 వేలు ఉంటుంది.. బుకింగ్స్ ఇప్పటికే ప్రారంభమైనాయి.

HTC Desire 22 pro స్పెసిఫికెషన్స్‌..

హెచ్‌టిసి వైవ్ ఫ్లో హెడ్‌సెట్‌తో జతగా ఈ ఫోన్ లభ్యమవుతుంది.యూజర్లు మెటావర్స్‌ను సులభంగా యాక్సెస్ చేయడానికి HTC Desire 22 Pro ఫోన్‌లో ప్రత్యేకమైన VIVERSE యాప్‌ను రూపొందించింది. ఈ యాప్‌ను ఉపయోగించి మీరు 300-అంగుళాల పెద్ద స్క్రీన్‌ను మీ వైవ్ ఫ్లో హెడ్‌సెట్ నుంచి డిజైర్ 22 ప్రోకి ప్రసారం చేయవచ్చు. అలాగే వర్చువల్ VIVE అవతార్‌లను సృష్టించవచ్చు.
ఈ ఫోన్‌లో VIVE వాలెట్‌ని ఉపయోగించి NFT లావాదేవీలను సులభంగా నిర్వహించవచ్చు.
ఇంకా క్రిప్టోకరెన్సీ సహా ఇతర డిజిటల్ ఆస్తులను భద్రంగా దాచుకోవచ్చని కంపెనీ పేర్కొంది.
120Hz రిఫ్రెష్ రేట్‌ కలిగిన 6.6 అంగుళాల ఫుల్ HD+ LCD డిస్‌ప్లే అందించారు.
8 GB RAM, 128 GB స్టోరేజ్ సామర్థ్యంతో ఇది పనిచేస్తుంది.
స్నాప్‌డ్రాగన్ 695 ప్రాసెసర్‌ అందించారు.
వెనకవైపు 64MP + 13MP+ 5MP ట్రిపుల్ కెమెరా సెటప్ ఇచ్చారు. సెల్ఫీలు వీడియో కాల్స్‌ కోసం..ముందు భాగంలో 32 MP సెల్ఫీ షూటర్‌ ఇచ్చారు.
ఆండ్రాయిడ్ 12 ఆపరేటింగ్ సిస్టమ్‌పై ఇది పనిచేయనుంది.
4520 mAh బ్యాటరీ సామర్థ్యం, 15W ఫాస్ట్ ఛార్జర్
ఇంకా ఈ ఫోన్ డస్ట్ రెసిస్టెన్స్, వాటర్ రెసిస్టెన్స్ కోసం IP67 రేటింగ్స్ కలిగి ఉంది.
కనెక్టివిటీ పరంగా HTC Desire 22 Proలో 55G, డ్యూయల్-సిమ్‌ స్లాట్, Wi-Fi 5, బ్లూటూత్ 5.1, GPS, NFC, టైప్-సి పోర్ట్ ఉన్నాయి.
 సెప్టెంబర్ నెలలో ఇండియన్ మార్కెట్లోనూ ఈ ఫోన్ విడుదలయ్యే అవకాశం ఉందని టెక్‌ నిపుణుల అభిప్రాయం.
-Triveni Buskarowthu

Read more RELATED
Recommended to you

Exit mobile version