Raja Vikramarka: “రాజావిక్రమార్క”కు రాకకు ముహూర్తం ఖ‌రారు!

-

Raja Vikramarka: ఆర్ఎక్స్ 100 తో సంచలన విజయం అందుకున్న యంగ్ హీరో కార్తికేయ. తొలి చిత్రంతోనే సూపర్ హిట్ అందుకోవడంతో ఓవర్ నైట్ స్టార్ గా మారాడు. ఆ తర్వాత వరుసగా సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు ఈ యంగ్ హీరో. ఈ కుర్రహీరో నటిస్తున్న తాజా చిత్రం “రాజా విక్రమార్క”.
ఈ చిత్రానికి వి. వి. వినాయక్ శిష్యుడైన శ్రీసరిపల్లి దర్శకత్వం వహిస్తున్నారు. ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ తెర‌కెక్కుతున్న ఈ చిత్రాన్ని రామరెడ్డి నిర్మిస్తున్నారు.

శరవేగంగా చిత్రీకరణ జరుపుకొంటున్న ఈ సినిమా అతి త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ మేరకు తాజాగా ‘రాజా విక్రమార్క’ రిలీజ్‌ డేట్‌ను చిత్రబృందం ప్రకటించింది. నవంబర్‌ 12న ‘రాజా విక్రమార్క’ ప్రేక్షకుల ముందుకు రానుంది. యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా రూపుదిద్దుకున్న సినిమాలో కార్తికేయ ఎన్‌ఐఏ ఏజెంట్‌ విక్రమ్‌గా కనిపించనున్నారు. కార్తికేయ‌కు జంట‌గా సీనియర్ కన్నడ స్టార్ హీరో రవిచంద్రన్ మనవరాలు తాన్యా రవిచంద్రన్ ఈ మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది.

సాయి కుమార్‌, తనికెళ్ల భరణి కీలకపాత్రల్లో కనిపించనున్నారు. రమా రెడ్డి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.
ఈ యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెర‌కెక్కుతున్న ఈ చిత్రానికి ప్రశాంత్ ఆర్ విహారి సంగీతం అందిస్తున్నారు.
ఆది రెడ్డి టి సమర్పణలో రూపొందుతున్న ఈ సినిమా గ్రాండ్‌గా థియేట్రికల్‌గా రిలీజ్ కు సిద్ధమవుతోంది.
మరోవైపు, ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్‌ ప్రేక్షకులను ఎంతగానో అలరించిన విషయం తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Exit mobile version