శంషాబాద్ ఎయిర్‌పోర్టులో భారీగా గంజాయి పట్టివేత

-

శంషాబాద్ ఎయిర్ పోర్టులో మరోసారి భారీగా గంజాయి పట్టుబడింది.ఓ ప్రయాణికుడు ఓజీ కుష్ అనే గంజాయిని 24 బ్యాగుల్లో తరలిస్తున్నట్లు కస్టమ్స్ అధికారులు గుర్తించారు. వెంటనే స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు. బ్యాంకాక్ నుంచి వస్తున్న ప్యాసింజర్ మీద అనుమానం రావడంతో అదుపులోకి తీసుకుని తనిఖీలు చేయగా.. భారీగా గంజాయిని పట్టుకున్నారు.

ఇదిలాఉండగా, నిన్న భువనగిరిలో రూ.10 కోట్ల విలువైన గంజాయిని పోలీసులు ధ్వంసం చేసిన విషయం తెలిసిందే.2024-25లో పలు కేసుల్లో 135 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుని ధ్వంసం చేశామని డ్రగ్ డిస్పోజల్ కమిటీ చైర్ పర్సన్, రైల్వే ఎస్పీ చందనా దీప్తి వెల్లడించారు.ఇదిలాఉండగా, మొత్తం 74 కేసుల్లో రూ.10 కోట్లకు పైగా విలువైన గంజాయిని సీజ్ చేసినట్లు తెలిపారు.

 

Read more RELATED
Recommended to you

Latest news