గబ్చిబౌలిలో హైడ్రా పంజా.. భారీగా అక్రమ కట్టడాల కూల్చివేత

-

హైదరాబాద్ మహానగరంలోని అక్రమ కట్టడాలపై హైడ్రా మరోసారి పంజా విసిరింది.మంగళవారం ఉదయం సంధ్య కన్వెన్షన్ సెంటర్ మినీ హాల్, చుట్టుపక్కల నిర్మించిన కొన్ని ఫుడ్ కోర్టుల్ని సైతం కూల్చివేసింది.లే అవుట్‌లో ప్లాట్లు కనిపించకుండా, రోడ్డును ఆక్రమించి నిర్మాణాలు చేశారని స్థానికులు కొందరు హైడ్రాకు ఫిర్యాదు చేశారు.

వాటిని పరిశీలించిన హైడ్రా కూల్చివేతలు చేపట్టింది.సంధ్య కన్వెన్షన్ ప్రాంతంలోని ఫెర్టిలైజర్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎంప్లాయిస్ కో-ఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ లే అవుట్‌లో ఉన్న అక్రమ కట్టడాలను హైడ్రా కూల్చివేసింది.లే అవుట్ కనిపించకుండా రోడ్లు, పార్కులను కలుపుతూ నిర్మించిన రేకుల ఫెన్సింగ్, మినీహాల్, వంటగదులు, రెస్ట్ రూమ్స్‌, జీ +2గా నిర్మించిన 3 ఐరన్ షెడ్స్‌ను కూడా కూల్చివేసింది.

Read more RELATED
Recommended to you

Latest news