బీజేపీలో అసెంబ్లీ టికెట్లకు భారీ డిమాండ్.. అగ్ర నేతలు ఢిల్లీ బాట

-

బీజేపీలో అసెంబ్లీ టికెట్లకు బారీ డిమాండ్ ఏర్పడింది. టికెట్ కోసం తమ వంతు ప్రయత్నాలు చేసుకునేందుకు పలువురు నేతలు ఢిల్లీ బాట పట్టారు. ఇక్కడ రాష్ట్రంలో ఓ వైపు దరఖాస్తు ఫారాల స్క్రూట్నీ జరుగుతున్న తరుణంలో నేతలు హస్తినబాట పట్టడం గమనార్హం. మహిళా బిల్లు నేపథ్యంలో ఢిల్లీలోనే ఉన్న బీజేపీ జాతీయ కార్యదర్శి బండి సంజయ్ ని, బీజేపీ స్టేట్ చీఫ్ కిషన్ రెడ్డిని కలుస్తూ తమకు టికెట్ వచ్చేలా చూడాలని కోరుతున్నారు. ఢిల్లీ వెళ్లినవారిలో నర్సాపూర్ నుంచి టికెట్ ఆశిస్తున్న గోపి, జూబ్లీహిల్స్ టికెట్ కోసం దరఖాస్తు చేసుకునన లంకల దీపక్ రెడ్డి, షాద్ నగర్ టికెట్ ఆశిస్తున్న మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి కుమారుడు మిథున్ రెడ్డి, పటాన్ చెరు కోసం దరఖాస్తు చేసుకున్న గడీల శ్రీకాంత్ గౌడ్, పరిగి టికెట్ ఆశిస్తున్న కిరణ్ గౌడ్, కంటోన్మెంట్ టికెట్ ఆశిస్తున్న సంధ్య థియేటర్ యజమాని శివ ఉన్నారు. అందోలో టికెట్ తన తండ్రికే కేటాయించాలని బాబు మోహన్ కుమారుడు ఉదయ్ బీజేపీ ముఖ్యనేతలను కలిసి వేడుకుంటున్నారని సమాచారం.

ఇక బీజేపీ సైతం కాంగ్రెస్‌ బాటలోనే ఆశావహుల నుంచి దరఖాస్తులు స్వీకరించింది. అయితే ఎలాంటి ఫీజు లేకపోవడంతో బీజేపీకి ఊహించని రీతిలో పెద్ద ఎత్తున దరఖాస్తులు వచ్చాయి. దాదాపు 6 వేలకుపైగా దరఖాస్తులు వచ్చినట్లు సమాచారం. దీంతో అభ్యర్థులను ఫైనల్ చేయడం ఆ పార్టీ పెద్దలకు తలనొప్పిగా మారింది. దీంతో అభ్యర్థులకు కొన్ని కండీషన్లు పెట్టినట్లు తెలుస్తోంది. అసెంబ్లీ టికెట్ కావాలంటే సోషల్ మీడియాలో కనీసం 25 వేల మంది ఫాలోవర్లు, లోక్‌సభ టికెట్ కావాలంటే కనీసం 10 వేల మంది ఫాలోవర్లు ఉండాలని షరతు విధించిందట. దీంతో ఈ కండీషన్లపై సోషల్‌మీడియాలో సెటైర్లు పేలుతున్నాయి.

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version