మెక్సికోలో 7.7 మ్యాగ్నిట్యూడ్ భూకంపం..! దారిలో ఉన్న సునామీ…!

-

huge earthquake in mexico and oxaca
huge earthquake in mexico and oxaca

2020 వ సంవత్సరం మొదటి నుండి ప్రమాదాలు విపత్తులే..! నిదుర కూడా ప్రమాదంగా మారిన ఘటనలు చూసాము ప్రజలు ఎవ్వరూ హాయిగా నిదుర కూడా పోలేని పరిస్థితి. ఎప్పుడు ఏ అనర్దం జరుగుతుందో.. ఏ విపత్తు సంభావిస్తుందో ఎవ్వరూ చెప్పలేకపోతున్నారు. ఇక ఇదే నేపద్యంలో మరో విపత్తు సంభవించింది, మెక్సికో లో భూకంపం సంభవించింది సునామీ కూడా వచ్చే అవకాశాలు కనపడుతున్నాయని వాతావరణ కేంద్రాలు శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

వివరాల్లోకి వెళితే.. మెక్సికోలోని దక్షిణ, మధ్య ప్రాంతాల్లో మంగళవారం తీవ్ర భూకంపం సంభవించింది. రిక్టర్‌ స్కేల్‌పై దీని తీవ్రత 7.4గా నమోదు కాగా భూకంపం తీవ్రత 7.7గా ఉందని, పైగా ఒక్సాకా సిటీ భూకంప కేంద్రంగా ఉన్నదని అమెరికా జియలాజికల్‌ సర్వే ప్రకటించింది. భూకంప ప్రభావంతో ఒక్సాకా తీరంలోని సముద్ర నీటిమట్టం 60 సెంటీమీర్ల మేర పెరిగిందని మెక్సికో సెస్మాలజీ సర్వీస్‌ అధికారులు తెలిపారు.  తీవ్ర భూకంపం వల్ల మెక్సికో సముద్ర తీరప్రాంతంలో 3.28 అడుగుల ఎత్తులో అలలు వచ్చే అవకాశం ఉన్నదని అమెరికా నేషనల్‌ ఓషియానిక్‌ అధికారులు వెల్లడించారు. హువాతుల్లో బీచ్‌లో సునామీ హెచ్చరికలను కూడా  జారీ చేసింది అక్కడి ప్రభుత్వం. ప్రభుత్వ కదనం ప్రకారం భూకంపం సంభవించిన ప్రాంతం నుండి వందల కిలోమీటర్ల ధురంలో ఉండే భవనాల్లో కూడా ప్రకంపనలు కనపడ్డాయి. ప్రజలంతా భాయాందోళనతో పరుగులు తీశారు, కాగా ప్రకంపనల కారణంగా ఒకరు మరణించినట్టు తెలుస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news