ఈ నూనెలతో నాభికి మసాజ్ చేయడం వలన కలిగే ప్రయోజనాలు ఇవే..!

-

సహజంగా ప్రతి ఒక్కరి ఇంట్లో కొబ్బరి నూనెను ఎన్నో రకాలుగా ఉపయోగిస్తూ ఉంటారు. అయితే కొబ్బరినూనె ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. కాళ్లు నొప్పులు, కీళ్ల నొప్పులు, శరీరంలో వేడి, అలసట, మోకాళ్ళ నొప్పి, పొడి చర్మం, జుట్టుకు సంబంధించిన సమస్యలు వంటి మొదలైన సమస్యలతో బాధపడుతుంటే కొబ్బరి నూనె ఎంతో సహాయపడుతుంది. ఈ విధంగా నాభికి కొబ్బరినూనెను రాసుకోవడం వలన కూడా ఎన్నో రకాల ప్రయోజనాలను పొందవచ్చు. ముఖ్యంగా ఈ మధ్యకాలంలో యువత సెల్ ఫోన్లు, లాప్టాప్ లు తో ఎంతో బిజీగా ఉంటున్నారు. అలాంటి సమయంలో కళ్ళు పొడిగా మారుతాయి.

కాబట్టి ప్రతిరోజు రాత్రిపూట నాభి చుట్టూ కొబ్బరి నూనె రాసుకుంటే ఎన్నో రకాల సమస్యలు తొలగిపోతాయి. కళ్ళు పొడిబారడం మరియు కంటి చూపు సరిగా లేకపోవడం వలన ఎన్నో రకాల ఇబ్బందులు పడాల్సి వస్తుంది. అయితే నాభికి మూడు చుక్కలు నెయ్యి లేక కొబ్బరి నూనెను రాసి మసాజ్ చేయడం వలన ఎంతో ప్రయోజనం ఉంటుంది. పిత్తాశయ రాళ్లు మరియు ప్యాంక్రియాటిక్ సమస్యలతో బాధపడుతుంటే రాత్రి పడుకునే ముందు నాభికి కొబ్బరినూనెను రాసి మసాజ్ చేయాలి.

ఇలా చేయడం వలన ఎంతో మంచి ఫలితాన్ని పొందవచ్చు. చర్మ సంబంధించిన సమస్యలతో బాధపడుతుంటే కొబ్బరి నూనెను తప్పకుండా ఉపయోగించాల్సిందే. నాభి చుట్టూ కొబ్బరి నూనెతో మసాజ్ చేయడం వలన జుట్టు రాలడం సమస్య కూడా తగ్గుతుంది. కొబ్బరి నూనెకు బదులుగా ఆముదం నూనెను కూడా రాసి మసాజ్ చేయవచ్చు. ఇలా చేయడం వలన ఆరోగ్యం ఎంతో మెరుగుపడుతుంది. మోకాళ్ళ నొప్పులు, శరీరం వనకడం, నీరసం, కీళ్ల నొప్పులు వంటి మొదలైన సమస్యలతో బాధపడుతుంటే ఆవనూనెను ఉపయోగించడం వలన చాలా ప్రయోజనం ఉంటుంది. నాభి చుట్టూ ఆవ నూనెతో మసాజ్ చేయడం వలన మోకాళ్ళ నొప్పులు, నీరసం వంటివి తగ్గుతాయి. అంతేకాకుండా మెరిసే జుట్టును మరియు ఎంతో మృదుమైన పెదవులను కూడా పొందవచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news