కుంభమేళా వెళ్లేవారికి బిగ్ అలర్ట్. కుంభమేళాలో ఆంక్షలు విధించింది UP ప్రభుత్వం. VIP పాసులను రద్దు చేసింది యోగి సర్కార్. భక్తుల రద్దీ దృశ్య ఆంక్షలు విధించింది కేరళ ప్రభుత్వం. ఫిబ్రవరి 5 వరకు ఈ ఆంక్షలు అమలులో ఉండనున్నాయి. తొక్కిసలాట ఘటనపై ఇప్పటికే న్యాయ విచారణకు ఆదేశించింది ప్రభుత్వం.
ఇవాళ మధ్యాహ్నం తొక్కిసలాట జరిగిన ప్రదేశానికి వెళ్లనున్న కమిటీ.. అక్కడ దర్యాప్తు చేయనుంది. ఇక అటు మహాకుంభ మేళాకు భారీ ట్రాఫిక్ జామ్ అయింది. ఉత్తరప్రదేశ్-మధ్యప్రదేశ్ సరిహద్దుల్లో పెద్ద సంఖ్యలో వాహనాలు నిలిచిపోవడంతో లక్షలాది మంది భక్తులు ట్రాఫిక్‌లో చిక్కుకుపోయారు. సుమారు 50 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బంది పడ్డారు.