శ్రీకాకుళంలోని బట్టల షాపులో భారీ అగ్నిప్రమాదం.. 3 కోట్ల ఆస్తినష్టం

-

శ్రీకాకుళంలోని ఓ షాపింగ్ మాల్‌లో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. పలాసలోని జాస్మిన్ బట్టల షాపులో భారీగా మంటలు ఎగిసి పడ్డాయి. షాపు నుంచి దట్టమైన పొగలతో మంటలు వ్యాపించడంతో భయంతో స్థానికులు పరుగులు తీశారు. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చేందుకు శ్రమించారు.

ఈ అగ్ని ప్రమాదం వలన సుమారు రూ.3 కోట్ల వరకు ఆస్తి నష్టం వాటిల్లిందని తెలుస్తోంది. మంటలు చుట్టు పక్కల షాపులకు వ్యాప్తించకుండా ఫైర్ సిబ్బంది తక్షణ చర్యలు చేపట్టారు. అనంతరం పోలీసులు ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీశారు. షార్ట్ సర్య్కూట్ వల్లే ప్రమాదం చోటుచేసుకుందని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కాగా, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news