సీనియర్ ఏఐఎస్ అధికారిణి స్మితా సబర్వాల్ మొన్నటివరకు మహారాష్ట్ర ఎన్నికల అబ్జర్వర్‌గా బాధ్యతలు నిర్వహించిన విషయం తెలిసిందే. తాజాగా ఆమె ఆ బాధ్యతల నుంచి రిలీవ్ అయ్యి రాష్ట్రానికి చేరుకున్న వెంటనే కొత్త బాధ్యతల్లో చేరిపోయారు. గతంలో తెలంగాణ ఫైనాన్స్ కార్పొరేషన్ మెంబర్ సెక్రటరీగా విధులు నిర్వహించిన స్మితా సబర్వాల్..ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం పలువురు ఐఏఎస్‌లను బదిలీ చేసిన సందర్భంగా రాష్ట్ర యువజనాభివృద్ధి, పర్యాటక, సాంస్కృతి శాఖ కార్యదర్శిగా స్మితా సబర్వాల్‌ను ప్రభుత్వం బదిలీ చేసింది.
ఆమెకు ఈ నెల 12న కొత్త పోస్టింగ్ ఇచ్చినప్పటికీ మహారాష్ట్ర ఎన్నికల అబ్జర్వర్‌గా వెళ్లడంతో తిరిగి వచ్చాక నూతన బాధ్యతలు చేపట్టారు.ఇటీవల మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో స్మితా సబర్వాల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం బుల్దానా, మల్కాపూర్ అసెంబ్లీ నియోజకవర్గాలకు ఎలక్షన్ జనరల్ అబ్జార్వర్‌గా నియమించింది. ఆ విధులు పూర్తి చేసుకుని తిరిగి వచ్చిన ఆమె వెంటనే కొత్త బాధ్యతల్లో చేరిపోయారు.