ఉద్యోగులకు డిస్నీ షాక్.. ఏకంగా 7000 మంది తొలగింపు

-

సాఫ్ట్​వేర్ ఉద్యోగులపై ఆయా కంపెనీలు లేఆఫ్స్ పేరిట పిడుగులాంటి వార్తలు చెవిన వేస్తున్నాయి. ఇప్పటికే ప్రముఖ కంపెనీలు భారీగా లేఆఫ్స్ ప్రకటించాయి. తాజాగా ఆ లిస్టులో డిస్నీ కూడా చేరింది. డిస్నీ తాజాగా 7వేల మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు ప్రకటించింది. 5.5 బిలియన్‌ డాలర్ల ఖర్చులను ఆదా చేయడంలో భాగంగా ఇలా చేస్తున్నట్లు డిస్నీ సీఈఓ బాబ్‌ ఇగర్‌ వెల్లడించారు.

డిస్నీలో మొత్తం 2 లక్షల 20 వేల మంది ఉద్యోగులు పనిచేస్తుండగా… వారిలో 3 శాతం మందికి ఉద్వాసన పలకనున్నట్లు సీఈఓ పేర్కొన్నారు. ఇటీవల డిస్నీ ప్లస్ వినియోగదారులు ఒక శాతం తగ్గి 168.1 మిలియన్‌కు పడిపోయారు. నష్టాలు పెరిగిపోతుండటం వల్ల ఇప్పటికే కొత్త నియామకాలు నిలిపివేసిన డిస్నీ.. పలు కఠిన నిర్ణయాలు తీసుకుంటోంది.

“ఈ రోజు సంస్థ ఎదుర్కొంటున్న సవాళ్లను అధిగమించడానికి ఈ నిర్ణయం చాలా అవసరం. అయినా నేను ఈ నిర్ణయాన్ని అంత తేలికగా తీసుకోను. ప్రపంచవాప్తంగా ఉన్న మా ఉద్యోగుల ప్రతిభ, అంకితభావం పట్ల నాకు అపారమైన గౌరవం ఉంది.” అని డిస్నీ సీఈఓ బాబ్‌ ఇగర్‌ తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version