2015 తర్వాత సైన్యానికి భారీ నష్టం…!

-

ఒక పక్క కరోనా వైరస్ తీవ్రంగా ఉన్నా సరే ఉగ్రవాదులు మాత్రం ఆగడం లేదు. భారత సైన్యం మీద వరుస దాడులకు దిగుతున్నారు. సైన్యం మీద దాడులు చేయడానికి గానూ ఉగ్రవాదులు ఇప్పుడు కాశ్మీర్ సరిహద్దుల్లో ఉన్న అటవీ ప్రాంతాల నుంచి భారీగా వచ్చేస్తున్నారు. ఆర్మీ సేవలను ఇప్పుడు కరోనాకు వాడుకుంటున్నారు. దీనితో ఇబ్బంది లేదు అనుకున్న ప్రాంతాల్లో సైన్యాన్ని తగ్గించారు.

ఇప్పుడు అక్కడే ఉగ్రవాదులు ఫోకస్ చేయడం మొదలుపెట్టారు. కశ్మీర్‌లోని కుప్వారా జిల్లా హంద్వారా ప్రాంతంలో శనివారం రాత్రి ఆదివారం వేకువజాము వరకు ఉగ్రవాదులు కాల్పులకు దిగారు. అధుని చూసి సైన్యాన్ని దెబ్బ కొట్టారు. చంగీముల్లా గ్రామానికి చెందిన మహిళలు, చిన్నారులు సహా సుమారు 11 మందిని ఉగ్రవాదులు ఒక ఇంట్లో ఉంచారు అని సమాచారం అందడంతో భారీగా వెళ్ళింది సైన్యం.

కల్నల్‌ శర్మ, పోలీస్‌ సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ ఖాజీ నేతృత్వంలో సైన్యం, పోలీసులు ఆపరేషన్ చేపట్టగా ఉగ్రవాదులు ఇంట్లో నక్కి కాల్పులకు దిగారు. జవాన్లు ప్రాణాలకు తెగించి బందీలను, గ్రామస్తులను సురక్షితంగా గాయాలు కాకుండా బయటకు తీసుకుని రాగా… ఈ ఘటనలో సైన్యం భారీగా నష్టపోయింది. 21 రాష్ట్రీయ రైఫిల్స్‌లోని గార్డ్స్‌ రెజిమెంట్‌కు చెందిన కల్నల్‌ అశుతోష్‌ శర్మ, మేజర్‌ అనూజ్‌ సూద్, నాయక్‌ రాజేశ్, లాన్స్‌ నాయక్‌ దినేశ్‌ మరణించారు. కశ్మీర్‌లోయలో కల్నల్‌ స్థాయి అధికారి 2015 తర్వాత ఇప్పుడే ప్రాణాలు కోల్పోయారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version