ఆఫ్ఘన్ లో దారుణ పరిస్థితులు.. భోజనం ఖర్చు రూ.7500 !

-

అఫ్గాన్‌ స్తాన్‌ దేశం రాజ్యంగ సంక్షోభం నెలకొన్న సంగతి తెలిసిందే. గత వారం రోజుల కింద తాలిబన్లు… అఫ్గాన్‌ స్తాన్‌ దేశాన్ని స్వాధీనం చేసుకోవడంతో ఈ దుస్థుతి ఎదురైంది. అయితే… అఫ్గాన్‌ స్తాన్‌ దేశం లో ప్రజల పరిస్థితి రోజు రోజు మరీ దయనీయంగా తయారవుతోంది. వసతుల సంగతి పక్కన బెడితే… కనీసం తాగు నీరు మరియు భోజనం కోసం అక్కడి ప్రజలు చాలా ఆశగా ఎదురు చూడాల్సిన దుస్థితి నెలకొంది.

అఫ్గాన్‌ స్తాన్‌ దేశం లో ప్రస్తుతం వాటర్‌ బాటిల్‌ ధరలు రూ. 3 వేలు చేరుకోగా… భోజనం ప్లేట్‌ ధర రూ. 7500 లకు చేరుకుంది. దీంతో అఫ్గాన్‌ స్తాన్‌ దేశం ఉన్నటు వంటి పేద మరియు మధ్య తరగతి ప్రజలు భోజనం కొనుక్కోలేక… అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరో వైపు విమానాశ్రయాల్లో సైతం అఫ్గాన్‌ స్తాన్‌ కరెన్సీని అధికారులు తీసుకోవడం లేదు. దీంతో అఫ్గాన్‌ స్తాన్‌ దేశ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version