ఒక్కడి కోసం 20వేల మంది అమ్మాయిల దరఖాస్తులు..!!!! 

413

దరఖాస్తు స్వీకరణ ప్రక్రియ జరుగుతోంది అంటే, సాధారణంగా మనం ఏమనుకుంటాం? ఏ ఉద్యోగానికో లేక ఏ ప్రవేశ పరీక్షకో అనుకుంటాం కదా. ఇక్కడ జరుగుతున్న దరఖాస్తు స్వీకరణ పూర్తి భిన్నమైనది, ఇంకా చెప్పాలంటే విచిత్రమైనది కూడా. అంత విచిత్రం ఏంటి అనుకుంటున్నారా.. జపాన్ కుబేరుడు, గొప్ప వ్యాపారవేత్త అయిన యూసాకు మేజావా (44) చేసిన ఒక ప్రకటన ప్రస్తుతం సోషల్ మీడియా లో ఎంత వైరల్ గా మారిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు..

“స్పేస్ఎక్స్”  రాకెట్ లో చంద్రుని చుట్టూ తిరగటానికి సిద్ధమైన మేజావ తనకి తోడుగా, 20 ఏళ్ళు దాటిన  ఒక గర్ల్ ఫ్రెండ్ కావాలని ప్రకటన చేశాడు. అయితే ఇందుకోసం దరఖాస్తు చేసుకోడానికి ఈ నెల 17 వ తేదీని ఆఖరి  తేదీగా కూడా గడువు పెట్టాడు. దాంతో ఈ ప్రకటన వెలువడగానే అమ్మయిలు అతడితో వెళ్ళడానికి సిద్దం అంటూ కనబరుస్తున్నారు. ఇదిలాఉంటే

 

అతడు ఈ ప్రకటన విడుదల చేసిన  నాటి మొదలు ఇప్పటి వరకూ సుమారు 20 వేల మందికి పైగా అమ్మాయిలు, యూసాకు గర్ల్ ఫ్రెండ్ గా ఉండటానికి మాకు ఎటువంటి అభ్యంతరం లేదని అంటున్నారట. అయితే ఈ ట్రిప్ ఇప్పటి  కోసం కాదట. 2023 లో స్పేస్ ఎక్స్ చేపట్టే ఈ ట్రిప్ కి ఇప్పటి నుంచీ సదరు మిలీనియర్ ప్రిపేర్ అవుతున్నాడట.