గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో భారీగా విదేశీ మద్యాన్ని పోలీసులు పట్టుకున్నారు.ఈ కేసులో ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేశారు. విశ్వసనీయ సమాచారం మేరకు బషీర్ బాగ్ కేఫ్ బాహర్ రెస్టారెంట్ సమీపంలో టాటా వాటర్ ఏజెన్సీ గోదాంలో ఢిల్లీకి చెందిన 2003 విదేశీ మద్యాన్ని ఎన్‌ఫోర్స్ బీ టీం సీఐ చంద్రశేఖర్ గౌడ్ అండ్ బృందం పట్టుకుంది. వాటి విలువ రూ.9,68,150లుగా ఉంటుందని అంచనా.
మద్యం బాటిళ్లతో పాటు ఒక కారు, రూ.35వేల నగదు, రెండు మొబైల్స్ సీజ్ చేసి ఇద్దరిని అరెస్ట్ చేశారు. అయితే, హరీష్ కుమార్ ఇర్వాణి అనే వ్యక్తి గతంలో మద్యం వ్యాపారిగా కొనసాగారు.గత టెండర్స్‌లో మద్యం షాపు రాకపోవడంతో తనకున్న టాటా వాటర్ గోదాములో ఢిల్లీ నుంచి ఫారిన్ లిక్కర్స్ తెప్పిస్తూ బాటిల్‌పై రూ.1500 నుంచి 2000 లాభాలను పొందుతున్నాడు. ఈ కేసులో హరీష్, విలియమ్స్ జోసెఫ్ లను అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు.