ఏపీలో మరో దారుణం చోటు చేసుకుంది. వైసీపీ నేతను నరికి చంపారు కొందరు ప్రత్యర్థులు. ఈ సంఘటన రాయలసీమలో చోటు చేసుకుంది. రాయలసీమలో మరోసారి ఆధిపత్య పోరు బుసలు కొట్టింది. రాయలసీమ నంద్యాలలో వైసీపీ కార్యకర్త సుధాకర్ రెడ్డిని ప్రత్యర్థులు దారుణంగా హత్య చేశారు.

బండి ఆత్మకూరు మండలం లింగాపురానికి చెందిన సుధాకర్ రెడ్డి.. పొలానికి వెళ్లి వస్తుండగా ప్రత్యర్థులు దారి కాసి దాడి చేశారు. కత్తులతో తలపై నరకడంతో సుధాకర్ రెడ్డి అక్కడికక్కడే మరణించాడు. ఆధిపత్య పోరే ఈ హత్యకు కారణమని స్థానికులు తెలిపారు. ఇక ఈ సంఘటన పై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.