సీఎం రేవంత్‌తో మల్లారెడ్డి భేటీ.. పార్టీ మార్పుపై సంచలన కామెంట్స్

-

సీఎం రేవంత్ రెడ్డితో మాజీ మంత్రి, మేడ్చల్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి, ఆయన అల్లుడు మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. అనంతరం మీడియాతో మల్లారెడ్డి మాట్లాడుతూ.. తన నియోజకవర్గంలోని అభివృద్ధి పనులు, మెడికల్, ఇంజినీరింగ్ సీట్ల విషయంలో సీఎంను కలిసినట్లుగా వివరించారు.

మేడ్చల్ సెగ్మెంటులో పెండింగ్‌ పనులు పూర్తి చేయాలని సీఎం కలిస్తే తప్పేముందని ప్రశ్నించారు.72 ఏళ్ల వయసులో తాను పార్టీ మారి చేసేది ఏముందని.. ప్రస్తుతం ఆ పార్టీలోకి వెళ్లినవాళ్లే చాలా పరేషాన్లో ఉన్నారన్నారు. బీఆర్ఎస్ నుంచి పోటీకి మొత్తం నలుగురు తన ఫ్యామిలీ నుంచి సిద్ధంగా ఉన్నారని తెలిపారు. జమిలి ఎన్నికలు వస్తే ఎంపీగా పోటీ చేస్తానన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news