మానవ జీవ పరిణామ క్రమం ఎప్పుడు ప్రారంభమైందని ప్రశ్నిస్తే అందుకు ఎవరి వద్దా సరైన సమాధానాలు లేవు. కొందరు సైంటిస్టులు 40 వేల ఏళ్ల కిందటే మానవులు భూమిపై ఉద్భవించారని చెబుతారు.
మానవ జీవ పరిణామ క్రమం ఎప్పుడు ప్రారంభమైందని ప్రశ్నిస్తే అందుకు ఎవరి వద్దా సరైన సమాధానాలు లేవు. కొందరు సైంటిస్టులు 40 వేల ఏళ్ల కిందటే మానవులు భూమిపై ఉద్భవించారని చెబుతారు. మరికొందరు సుమారుగా 3.50 లక్షల ఏళ్ల కిందటే మానవ జీవ పరిణామ క్రమం ప్రారంభమైందని అంటుంటారు. అయితే పురాతత్వ శాస్త్రవేత్తలు ఈ విషయంలో ఎన్నో పరిశోధనలు జరుపుతున్నా ఇప్పటికీ మానవ జాతి ఆవిర్భావం ఎలా జరిగిందో కనుక్కోలేకపోయారు. కానీ యూరోప్ లో సైంటిస్టులకు దొరికిన మానవ శిలాజాలవల్ల మానవజాతి సుమారుగా 2.1 లక్షల ఏళ్ల కిందటే ఆవిర్భవించిందని తెలిసింది.
దక్షిణ గ్రీస్‌లోని అపిడిమా గుహల్లో 1970లలో సైంటిస్ట్ లకు రెండు మానవ కపాలాలాలు దొరికాయి. వాటిని పరిశోధించగా ఆసక్తికర విషయాలు తెలిశాయి. ఒక కపాలం 2.1 లక్షల ఏళ్ల కిందటిదని తేలగా, మరొక కపాలం 1.5 లక్షల ఏళ్ల కిందటిదని తేలింది. దీంతో కేవలం ఆఫ్రికాలోనే కాక ఐరోపాలోనూ మానవజాతి మూలాలు ఉన్నాయని సైంటిస్టులు తేల్చారు. సాధారణంగా ఇప్పటి వరకు అందరూ కేవలం ఆఫ్రికాలోనే మానవ జాతి ఉద్భవించిందని నమ్ముతూ వచ్చారు. కానీ తాజా పరిశోధనతో ఐరోపాలోనూ మానవజాతి మూలాలు ఉన్నాయని నిర్దారించారు.
కాగా గ్రీస్‌లో సైంటిస్టులకు దొరికినా కపాలాలు నియండెర్తల్ మానవులవని గుర్తించారు. వారు హోమోసెపియన్స్ కన్నా ముందు వారు. హోమో సెపియన్స్ అంటే పరిపూర్ణమైన మానవులుగా మారిన నియండెర్తల్ మానవులు అన్నమాట. ఈ హోమో సేపియన్స్ 40 వేల ఏళ్ల కిందటి వరకు ఉన్నారని పురాతత్వ శాస్త్రవేత్తలు చెబుతుండగా నియండెర్తల్ మానవులు సుమారుగా 3.50 లక్షల ఏళ్ల కిందట నుంచి 1.50 లక్షల ఏళ్ల వరకు ఉన్నారని వారంటున్నారు. ఈ క్రమంలో గ్రీస్‌లో దొరికిన ఆ కపాలాలు నియండెర్తల్ మానవులవని తేలడంతో ఐరోపాలోను మానవజాతి ఆవిర్భావానికి మూలాలు ఉన్నాయని సైంటిస్టులు అంచనా వేస్తున్నారు. అయితే ఈ విషయంపై మరిన్ని పరిశోధనలు చేస్తే గానీ అసలు మానవ జాతి ఆవిర్భావం ఎప్పుడు అయిందో తెలిసే అవకాశం లేదని సైంటిస్టులు అంటున్నారు..!