అమెరికాలో హరికేన్ బీభత్సం.. 105 మంది మృతి

-

ఆగ్నేయ అమెరికాలో ‘హెలెనా’ హరికేన్‌ బీభత్సం సృష్టిస్తోంది. భయంకరమైన తుపాను కారణంగా ఇప్పటివరకు 105 మంది మృతి చెందినట్లు అధికారులు నిర్దారించారు. ఫ్లోరిడా, జార్జియా, నార్త్‌ కరోలినా, సౌత్‌ కరోలినా, వర్జీనియా రాష్ట్రాల్లో కేటగిరి-4 హరికేన్‌ ప్రభావం అధికంగా ఉందని వెల్లడించారు.హెలెనా తుపాను కారణంగా మరణాల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ఇప్పటివరకు ముగ్గురు అగ్నిమాపక సిబ్బంది, ఒక మహిళ, నెల వయసున్న చిన్నారి సైతం మృతి చెందినట్లు సమాచారం.

జార్జియాలోని పలు ఆసుపత్రుల్లో విద్యుత్‌ సరఫరా నిలిచిపోగా..యునికోయ్‌ కౌంటీ ఆసుపత్రిని వరదలు ముంచెత్తాయి. హెలికాఫ్టర్ సాయంతో 54 మందిని అధికారులు రక్షించారు. టెనస్సీలోని న్యూపోర్ట్‌ సమీపంలో 7 వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఫ్లోరిడాలో తుపాను తీరం దాటేటప్పుడు గంటకు 225 కి.మీ వేగంతో గాలులు వీచినట్లు అధికారులు తెలిపారు.ఇక అట్లాంటాలో 48 గంటల్లో 28.24 సెంమీల వర్షపాతం నమోదవ్వగా.. 1886లో నమోదైన 24.36సెంమీ రికార్డును హెలెనా బద్దలు కొట్టినట్లు పేర్కొన్నారు. తుపాను ఎఫెక్ట్‌తో పాఠశాలలు, విశ్వవిద్యాలయాలకు సెలవు ప్రకటించగా ఇళ్లు, వాణిజ్య సముదాయలు నీటమునిగాయి. లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version