ప్రియుడితో కలిసి భర్త హత్య.. పాము కరిచి చనిపోయాడని యాక్టింగ్

-

ప్రియుడితో కలిసి ఓ వివాహిత తన భర్తను అతి దారుణంగా హత్య చేసింది. అనంతరం ఉదయం చేసి తన భర్త పాము కాటుకు చనిపోయాడని అందరినీ నమ్మించడానికి ప్రయత్నించింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని మీరట్‌లో శుక్రవారం ఆలస్యంగా వెలుగుచూసింది.

వివరాల్లోకివెళితే.. అమిత్ కశ్యప్ (25) అనే వ్యక్తి..తన భార్య రవితతో కలిసి నివసిస్తున్నాడు. అమిత్ స్నేహితుడు అమర్ దీప్‌కు, రవితకు మధ్య పరిచయం ఏర్పడగా అది కాస్త ప్రేమగా మారింది.ఈ విషయం తెలుసుకున్న అమిత్.. అమర్ దీప్, తన భార్య రవితతో గొడవపడ్డాడు. వారిద్దరూ ఏకాంతంగా కలుసుకోవడానికి అమిత్ అడ్డు వస్తున్నాడని ఇద్దరూ కలిసి గొంతు నులిమి చంపేశారు.

అప్పటికే పథకం ప్రకారం రూ.1000 పెట్టి కొనుక్కొచ్చిన పామును శవం పక్కన వేశారు. అమిత్ పాము కాటుతో చనిపోయాడని రవిత ఉదయం లేచి ఏడ్చి అందరిని నమ్మించింది. అయితే, అమిత్ శవానికి పోస్ట్‌మార్టం చేయగా గొంతు నులిమి చంపేశారని.. పాము కాటుతో చనిపోలేదని డాక్టర్లు గుర్తించారు.విషయం తెలిసి పోలీసులు వారి స్టైల్లో అమర్ దీప్‌,రవితను గట్టిగా నిలదీయడంతో తామే హత్య చేశామని ఒప్పుకున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news