తెలుగు రిలీజ్ ఐన మరో అదిరిపోయే మూవీ జగమెరిగిన సత్యం.. తెలంగాణ హృదయాన్ని మాటల్లో కాక, ముళ్లపూడి మట్టిలో చూపించే కళాకారుడు కథా నేపథ్యంలో ఈ మూవీ వచ్చింది. థియేటర్ లో రిలీజ్ అయి మంచి టాక్ తెచ్చుకుంటోంది. ఇక ఈ సినిమా కథ విజయాల్లోకి వెళితే…
కథ:
తెలంగాణ రాష్ట్రంలోని ఓ చిన్న ఊరులో సత్యం అనే యువకుడు జీవిస్తున్న లైఫ్ ఆధారంగా ఈ సినిమా కొనసాగుతుంది. అతని జీవితం సాదాసీదాగా కనిపించినప్పటికీ… అతని ప్రేమ అలాగే బాధ వర్ణనాతీతం. సత్యం కథ ఒక వ్యక్తి గాధ కాదు… ఒక ఊరి జీవితం అని చెప్పవచ్చు. సత్యం జుట్టు నడిచే పాత్రలన్నీ… మనకు దగ్గర జరిగినట్లే అనిపిస్తుంది. ఇక ఈ సినిమాలో గ్రామంలో జరిగే రాజకీయాలు, పెద్ద మనుషుల మధ్య గొడవలు… అక్కడి సంస్కృతుల గురించి తెలియజేస్తుంది.
ఈ సినిమాలో ప్రతి సీన్…. తెలంగాణ యాస భాష లను తట్టి లేపుతాయి. చిన్న సన్నివేశాల్లోనూ హృదయాన్ని తాకుతాయి. సెకండాఫ్ లో మాత్రం కథ… చాలా ఎమోషనల్ గా ఉంటుంది. హీరో పాత్రలో ఉన్న సత్యం జీవితంలో వచ్చిన తిరుగుబాటు… ఆయన సాధించే విజయాల గురించి స్పష్టంగా చూపించారు దర్శకుడు. క్లైమాక్స్ లో అయితే వచ్చే ఎమోషనల్ హై పాయింట్… అందరినీ ఆకట్టుకుంటుంది. ఈ సినిమా చూసిన వాళ్లు కచ్చితంగా కన్నీళ్లు పెట్టుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది.
ప్లస్ పాయింట్స్
తెలంగాణ భాష, యాష
డైలాగులు
ఎమోషనల్ రైటింగ్
సత్యం పాత్ర
మైనస్ పాయింట్స్:
కొంత చోట్ల నెమ్మదిగా సాగిన కథనం
మరికొన్ని పాత్రలకు మరింత డెప్త్ ఉంటే బాగుండేది
Rating : 3/5