విడిపోయినా భార్య ఖర్చులు భరించాల్సిందే.. సుప్రీం కోర్టు..

-

టెలికాం రంగంలో జాతీయ భద్రత విషయాల్లో పనిచేస్తున్న వ్యక్తికి తన భార్య నెలవారి ఖర్చుల నిర్వహణను చూసుకొమ్మని, అంతేగాక విడిపోతున్నందుకు ఖర్చులు ఇవ్వాల్సిందేనని సుప్రీం కోర్టు తెలిపింది. 2009లో భార్య, భర్త మీద గృహ హింస చట్టం కింద కేసు నమోదు చేసింది. అప్పుడు 12 ఏళ్లుగా ఆమెను విడిచిపెట్టినందుకు రూ .50 లక్షలు, వివాహేతర సంబంధం పెట్టుకున్నందుకు 50 లక్షలు, కోర్టు కేసులను ఎదుర్కొనేందుకు భార్యను విడిచిపెట్టినందుకు 50 లక్షలు, ఒక మీడియా సంస్థలో ఉద్యోగం చేయమని బలవంతం చేసినందుకు 50 లక్షలు, విదేశీ మహిళలతో బహిరంగంగా జీవించడం ద్వారా మానసిక వేదనకు రూ .50 లక్షలు, భాగస్వామ్య గృహానికి అద్దె చెల్లించనందుకు 50 లక్షలు కట్టమని కోరింది.

 

ఈ ఖర్చులన్నింటినీ నెలవారీగా నిర్వహణకి ఇవ్వాలని 1.75లక్షలు నెల నెలా కట్టాల్సిందేనని కోరింది. ఇవన్నీ కట్టడానికి వారం రోజులు సమయం ఇస్తున్నామని తెలపగా, భర్త తరపున న్యాయవాది మాట్లాడుతూ, టెలికాం రంగంలో భద్రత విషయంలో పనిచేస్తున్న భర్త, అందులో పరిశోధనలకి డబ్బు ఖర్చు చేసాడని తెలిపాడు. భార్య తరపున వారు మాట్లాడుతూ, భర్తకి జర్మనీలో కంపెనీలు ఉన్నాయని, దానికోసం చాలా డబ్బు ఖర్చు చేస్తున్నాడని అన్నారు.

దానికి సుప్రీం కోర్టు అలాంటి విషయాలు ఇక్కడ చర్చించవద్దని, నెలవారీ ఖర్చులు ఖచ్చితంగా కట్టాల్సిందేనని కోరారు. తమిళనాడుకి చెందిన భర్త, భార్యతో విడిపోవడంతో సుప్రీ కోర్టు ఇలాంటి ఖర్చులన్నీ భర్తే భరించాలని కోరింది. వారం రోజుల్లో మొత్తం చెల్లించాలని కోరగా, వారం రోజులు మరీ తక్కువ సమయం అని నాలుగు వారాలైనా ఇప్పించాలని కోరారు. దానికి ధర్మాసనం సరేనంది. అంతే కాదు భర్త ఉంటున్న ఇంటిలో భార్యకు స్థానం ఉంటుందని, సొంత ఇల్లు కట్టుకునే వరకూ భార్య కూడా అక్కడే ఉండొచ్చని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version