హుజూరాబాద్ లో కోట్లు పంచుతున్నా.. ఈసీ పట్టించుకోవడం లేదు.- మానిక్కం ఠాగూర్

-

హుజూరాబాద్ లో ఉప ఎన్నికల పోరు రసవత్తరంగా సాగుతోంది. నామినేషన్ల ఘట్టం ముగియడం, పోలింగ్ కు మరో పదిరోజుల గడువు ఉండటంతో రాజకీయ పార్టీలు తమ ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. తాజాగా హుజూరాబాద్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరుపున ఆ పార్టీ వ్యవహారాల ఇంచార్జ్ మానిక్కం ఠాగూర్ ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఈసీ టార్గెట్ గా విమర్శలు గుప్పించారు. కోట్లు కోట్లు డబ్బులు పంచుతునక్నా పట్టించుకోవడం లేదన్నారు. ఎన్నికల కమీషన్ హుజూరాబాద్ ఎన్నికలపై అదుపు తప్పిందని విమర్శించారు. దసరా పండగ సందర్భంగా హుజూరాబాద్ నియోజకవర్గంలో టీఆర్ఎస్ పార్టీ డబ్బులను ఏరులై పారించిందన్నారు. పెరిగిన పెట్రోల్ ధరలపై టీఆర్ఎస్ ఎందుకు స్పందించడం లేదన్నారు. ఇంటికో నిరుద్యోగి ఉన్నాడు కాబట్టే ఆ సమస్యను ఎత్తిచూపడానికే వెంకట్ ను ఎంపిక చేసినట్లు తెలిపారు. ఎన్నికలకు మరో 224 గంటల సమయం ఉందని అది కాంగ్రెస్కు సరిపోతుందని అన్నారు. గ్యాస్ పెట్రోల్ ధరల పెరుగుదలను ప్రజల్లోకి తీసుకెళ్తాం అన్నారు. హరీష్ రావు డబ్బుతో గెలవాలనుకుంటున్నారని ఆరోపించారు. కాళేశ్వరం అవినీతి డబ్బులను ఎన్నికల్లో పెడుతున్నారన్నారు. హుజూరాబాద్లో పోటీ కాంగ్రెస్, బీజేపీ మధ్యే ఉంటుందని ఠాగూర్ అన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version