బీజేపీపై హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు… నడిరోడ్డుపై రైతుల్ని చంపినందుకా ఓటు..?

-

హుజూరాబాద్ ఎన్నికల్లో భాగంగా హరీష్ రావు బీజేపీ పార్టీపై విరుచుకుపడ్డారు. ఆ పార్టీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉత్తర్ ప్రదేశ్లో రైతుల్ని నడిరోడ్డుపై  కారు ఎక్కించి చంపినందుకు బీజేపీ పార్టీకి ఓటేయాలా ..? అని ప్రశ్నించారు. సంపదను పెంచి పేదలకు పంచేది టీఆర్ఎస్ అయితే పేదలను దంచి పెద్దలకు పంచడం బీజేపీ నైజం అని విమర్శించారు. పేదలపై పెట్రోల్, డిజిల్, గ్యాస్ సిలిండర్ల ధరలు పెంచేది బీజేపీ ప్రభుత్వం అన్నారు. రైతులకు ఏం మేలు చేసిందని బీజేపీ పార్టీకి  ఓటేయాలి, రైతులకు రైతుబంధు, రుణమాఫీ, రైతు భీమా అందించి ఆదుకున్నది టీఆర్ఎస్ పార్టీ అని ఆయన అన్నారు. రైతుల్ని ఖలిస్తాన్ ఉగ్రవాదులతో కేంద్రమంత్ర పోల్చినందుకు బీజేపీకి రైతులు ఓటు వేయాలా..? అని అన్నారు. బీజేపీ ప్రభుత్వం రైతుల మోటర్లకు మీటర్లను పెట్టాలని చెబుతున్నా.. రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వ ఆ పనిచేయడం లేదని హరీష్ రావు అన్నారు. రైతు వ్యతిరేఖ చట్టాలు తెచ్చినందుకు బీజేపీ పార్టీకి ఓటేయాలా అని విమర్శించారు. హుజూరాబాద్ లో గెలువబోయేది టీఆర్ఎస్ పార్టీనే అని హరీష్ రావు ధీమా వ్యక్తం చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version