ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ పై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరో సంచలన ట్వీట్ చేశారు. ఎన్ని వాగ్ధానాలు చేసినా… ఎన్ని అరుపులు అరిచినా.. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి లో ఎలాంటి మార్పు రాదని చురకలు అంటించారు. ”ఆంధ్ర రాష్ట్ర బడ్జెట్టుని ఎంత మసి పూసి మారేడుకాయ చేసినా… ‘సంపాదన కన్నా ఎక్కువ ఖర్చుపెట్టలేరు. పండించిన దాని కన్నా ఎక్కువ పంచలేరు. ఈ మౌలిక ఆర్ధిక సూత్రాన్ని ‘వైసీపీ ప్రభుత్వం’ మరిచినట్టుంది.” అంటూ పవన్ కళ్యాణ్ ట్వీట్ చేశారు.
ఇకనైనా పాలన జగన్ సర్కార్ దృష్టి పెట్టాలని చురకలు అంటించారు పవన్ కళ్యాణ్. కాగా… గత కొన్ని రోజులు గా వైసీపీ సర్కార్ మరియు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మధ్య వివాదం చెలరేగుతున్న సంగతి తెలిసిందే. ఆన్ లైన్ లో సినిమా టికెట్లు పెట్టే విధానాన్ని తీవ్రంగా వ్యతిరేకించిన పవన్ కళ్యాణ్… అప్పటి నుంచి ఏపీ సర్కార్ పై వైఫల్యాలపై దృష్టి పెట్టారు. ఇక అటు పవన్ కళ్యాణ్ చేస్తున్న వ్యాఖ్యలకు అదే రీతిలో వైసీపీ నేతలు కౌంటర్ ఇస్తుండటం గమనార్హం.
ఎన్ని వాగ్దానాలు చేసినా
ఎన్ని అరుపులు అరిచినా
రాష్ట్ర బడ్జెట్టుని ఎంత మసి పూసి మారేడుకాయ చేసినా'సంపాదన కన్నా ఎక్కువ ఖర్చుపెట్టలేరు
పండించిన దానికన్నా ఎక్కువ పంచలేరు'ఈ మౌలిక ఆర్ధిక సూత్రాన్ని 'వైసీపీ ప్రభుత్వం' మరిచినట్టుంది. pic.twitter.com/S5mHzwizV9
— Pawan Kalyan (@PawanKalyan) October 8, 2021