HYD : ఐటీసీ కోహినూర్ ఎదురుగా ఫుట్ పాత్ వర్కర్స్ యూనియన్ మెంబర్స్ ఆందోళన

-

హైదరాబాద్‌లోని మాదాపూర్ ఐటీసీ కోహినూర్ ఎదురుగా ఫుట్ పాత్ వర్కర్స్ యూనియన్ సభ్యులు ఆందోళనకు దిగారు. ఫుట్ పాత్ పక్కన చిన్న చిన్న షాపులు పెట్టుకుని జీవనోపాధిని పొందుతున్న వారిపై జీహెచ్ఎంసీ అధికారులు జులుం చేస్తున్నారని, సీఎం రేవంత్ రెడ్డి చెప్పినా వారిలో మార్పు రాలేదని ఫైర్ అవుతున్నారు. ఫుట్ పాత్ వర్కర్లకు న్యాయం చేయాలని ఆ యూనియన్ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు.

ఈ క్రమంలోనే మాదాపూర్ ఐటీసీ కోహినూర్ ఎదురుగా యూనియన్ సభ్యులు గురువారం ధర్నా చేపట్టారు. గతంలో సీఎం రేవంత్ రెడ్డి కుమారీ ఆంటీ విషయంలో రోడ్డు పక్కన ఫుడ్ స్టాల్స్ నడిపించుకోవడానికి పర్మిషన్ ఇచ్చిన విషయం తెలిసిందే.కానీ, ఇప్పుడు అక్కడున్న కొన్ని సంస్థలు..జీహెచ్ఎంసీ అధికారుల సాయంతో వాటిని తొలగించే ప్రయత్నం చేస్తున్నారని, వెంటనే సీఎం రేవంత్ కలుగజేసుకుని తమకు న్యాయం చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version