పెట్రోల్ ధరలు విపరీతంగా పెరిపోతున్నాయి. దీనితో వాహనదారులు కూడా ఎలెక్ట్రిక్ వాహనాల వైపు మక్కువ చూపిస్తున్నారు. తాజాగా హైదరాబాద్ కి చెందిన ప్రముఖ స్టార్టప్ కంపెనీ ఆటమ్ మొబైల్ సరికొత్త ఎలక్ట్రిక్ బైక్ ను విడుదల చేసింది. పైగా లైసెన్స్, పెట్రోల్ అవసరమే లేదు. ఇక ఈ టూ వీలర్ ఫీచర్స్ ని కనుక చూస్తే.. సూపర్ టెక్నాలజీ తో దీనిని తయారు చేయడం జరిగింది.
ఇప్పటి వరకు 400 పైగా యూనిట్లో బుక్ చేసుకున్నట్లు సమాచారం. ఈ బైక్ డెలివరీలు కూడా స్టార్ట్ అయ్యాయి. హైదరాబాద్ , న్యూ ఢిల్లీ , కోల్కతా, చెన్నై, బెంగళూరు వంటి నగరాలలో ఆటమ్ 1.0 బైక్ ను అందించనుంది. ఈ బైక్ వలన లైసెన్స్ పెట్రోల్ అవసరం లేదు పైగా చలానాలు కూడా పడవు కూడా.