బయోడైవర్సిటీ ఫ్లై ఓవర్ పై నిబంధనలు.. ఇవి బ్రేక్ చేస్తే అంతే సంగ‌తులు..

-

హైదరాబాద్ నగరం గచ్చిబౌలి బయోడైవర్సిటీ ఫ్లై ఓవర్ పై ఇటీవ‌లె తిరిగి ప్రారంభ‌మైంది. అయితే ఈ వంతెనపై వాహనాల రాకపోకల విషయంలో ట్రాఫిక్ పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్నారు. వంతెనపై 50 కిలోమీటర్ల వేగానికి మించి వెళ్లరాదని స్పష్టం చేసిన పోలీసులు సీసీ కెమెరాల ద్వారా వాహన చోదకులను గమనిస్తున్నారు. 58 కిలోమీటర్ల వేగంతో వెళ్లిన ఓ వ్యక్తికి ఇప్పటికే వాతపడింది. ఫ్లై ఓవర్ పై గంటకు వాహన చోదకులు 70 నుంచి 80 కిలోమీటర్ల వేగంతో వెళ్తున్నారని పోలీసులు గుర్తించారు. గతంలో 70 కిలోమీటర్ల వేగం దాటితే వెయ్యి రూపాయలు జరిమానా విధించే వారు.

తాజాగా యాభై దాటినా పడుతుంది. అలాగే లేన్ల డివైడర్ లైన్ క్రాస్ చేసినా వాత పడుతుంది. వంతెనపై మూడు లేన్లు ఉన్నాయి. వాహన చోదకులు ఓ లేన్లో ప్రయాణిస్తూ మధ్యలో మరో లేన్లోకి, ఈ చివరి నుంచి ఆ చివరికి మారుతుండడంతో వెనుక నుంచి వచ్చే వాహన చోదకులు తికమక పడుతున్నారు. దీంతో మొదటి లేన్లో (ఎడమ) ద్విచక్ర వాహనాలు, మిగిలిన రెండు లేన్లలో ఇతర వాహనాలను అనుమతిస్తున్నారు. వంతెనపై సెల్ఫీలు, ఫొటోలకు దిగినా కఠినంగా వ్యవహరించనున్న‌ట్టు తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version