పోలీసుల కళ్లుగప్పి.. హైదరాబాద్‌ నుంచి పరారైన చైన్ స్నాచర్లు

-

ఏడాది తర్వాత మళ్లీ హైదరాబాద్ నగరంలో కలకలం సృష్టించిన చైన్ స్నాచర్లు ఒకేరోజు ఆరు ప్రాంతాల్లో వరుస గొలుసు దొంగతనాలకు పాల్పడ్డారు. ఉత్తర్ ప్రదేశ్‌కు చెందిన ఓ ముఠా ఈ చోరీకి పాల్పడినట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. ఈ ముఠాలో నలుగురు సభ్యులున్నారని పోలీసులు తెలిపారు. వారి కోసం గత నాలుగు రోజులుగా నగరంలోని పలు ప్రాంతాలు, వాహనాలను తనిఖీ చేశారు. అనుమానితులను అదుపులోకి తీసుకొని ప్రశ్నించినా ఎక్కడా అంతరాష్ట్ర దొంగల ఆనవాళ్లు లభించలేదు.

చోరీలు చేసిన తర్వాత నిందితులు సికింద్రాబాద్‌ ప్యారడైజ్‌ వద్ద వాహనం వదిలేసి ఆటోలో వివిధ ప్రాంతాలను చుట్టేశారు. సికింద్రాబాద్, కాచిగూడ, నాంపల్లి రైల్వేస్టేషన్లు ఏంజీబీఎస్​ పరిసర ప్రాంతాల్లో చక్కర్లు కొట్టినట్టు సీసీకెమెరాల ఫుటేజ్‌లో పోలీసులు గుర్తించారు. ఏంజీబీఎస్​ వద్ద చివరిసారి కనిపించిన దొంగలు ఎటు వెళ్లారనేది పోలీసులు అంచనా వేయలేకపోయారు. అయితే పోలీసులను ఏమార్చేందుకు చాకచక్యంగా వ్యవహరించినట్లు అనుమానిస్తున్నారు.

రైల్వేస్టేషన్, బస్‌స్టేషన్లలోకి వెళ్లినట్లు నటించి.. కొంత సమయం తర్వాత మరోమార్గంలో బయటకు వచ్చారు. రైల్లో ప్రయాణించినట్లు బలంగా నమ్మేలా మస్కా కొట్టారు. ఆ తర్వాత నలుగురు నిందితులు రోడ్డుమార్గంలో హైదరాబాద్‌ దాటి కర్ణాటక లేదా మహారాష్ట్ర చేరినట్లు సమాచారం.

Read more RELATED
Recommended to you

Exit mobile version