జర్నలిస్టులపై సినీ నటుడు మోహన్ బాబు దాడి చేసిన ఘటన ప్రస్తుతం తెలంగాణలో సంచలనంగా మారింది.ఈ మేరకు బుధవారం ఫిలిం ఛాంబర్ ఎదుట సీనియర్ జర్నలిస్టులు దేవులపల్లి అమర్, అల్లం నారాయణ కలిసి భారీ ఎత్తున జర్నలిస్టులు నల్ల బ్యాడ్జిలు ధరించి అక్కడే బైఠాయించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా అల్లం నారాయణ మాట్లాడుతూ..జర్నలిస్టుపై దాడికి పాల్పడిన మోహన్ బాబుపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
కాకుండా, వెంటనే హత్యాయత్నం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. ఇక మోహన్ బాబు జర్నలిస్టుపై ఓ ఉన్మాదిలా దాడి చేశారని ఫైర్ అయ్యారు. ఒక రౌడీలా రంజిత్‌పై హత్యాయత్నానికి పాల్పడ్డారని, ఘటన జరిగి గంటలు గడుస్తున్నా.. ఇప్పటి వరకు మోహన్ బాబు ఇంకా క్షమాపణలు చెప్పలేదని అన్నారు. వాళ్ల కుటుంబ సమస్య బజారున పడ్డాక, కేసులు నమోదయ్యాకే మీడియా జోక్యం చేసుకుందన్నారు. జర్నలిస్టుపై దాడి చేసిన ఘటనలో మోహన్ బాబును వెంటనే అరెస్ట్ చేయాలని అల్లం నారాయణ డిమాండ్ చేశారు.