హైదరాబాద్ లో క్రైమ్ రేటు ఎంతో తెలుసా?

-

భాగ్యనగరంలో గతంలో పోలిస్తే క్రైమ్ రేటు తగ్గిందని హైదరాబాద్ సీపీ అంజనీ కుమార్ తెలిపారు.  2018తో పోల్చుకుంటే నగరంలో క్రైమ్‌ రేటు 6 శాతం తగ్గింది. ఏడాదిలో పోలీసు శాఖ పనితీరు, క్రైమ్ రేటు ఇతర అంశాలపై బుధవారం నిర్వహించిన సంవత్సరాంతపు పత్రికా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఈ ఏడాది నమోదైన కేసులు, వాటిని ఛేదించిన తీరు, అసెంబ్లీ ఎన్నికల నిర్వహణ సజావుగా సాగడంలో పోలీసుల పాత్ర తదితర వివరాలను వెల్లడించారు. గతేడాదితో పోలిస్తే ప్రాపర్టీ క్రైమ్‌లో 20 శాతం, వరకట్న చావులు 38 శాతం, కిడ్నాప్‌ కేసులు 12 శాతం, లైంగిక వేధింపుల కేసుల్లో 7 శాతం తగ్గిందని సీపీ పేర్కొన్నారు.

అయితే మర్డర్‌ కేసులు మాత్రం 2017తో పోలిస్తే 8 శాతం పెరిగాయని తెలిపారు. ఎన్నికల సమయంలో 29 హవాలా సొత్తుని స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. కరడుగట్టిన నేరస్తులపై 2017లో 53 మందిపై పీడీ యాక్ట్ నమోదు చేస్తే ఈ ఏడాది102 మంది మీద నమోదు చేశామని  వివరించారు. షీటీమ్స్ భరోసా సెంటర్లలో 1028 కేసులు నమోదు చేశామని సీపీ పేర్కొన్నారు. 2018లో మొట్టమొదటిసారిగా 40 మంది పోలీసులతో సిటీ రాపిడ్‌ యాక్షన్ ఫోర్స్‌ను ఏర్పాటు చేశామన్నారు. రేవ్ పార్టీలు, అసాంఘిక కార్యకలాపాలపై పోలీసు శాఖ సీరియస్ గా వ్యవహరిస్తున్నట్లు తెలిపారు. సామాన్యులకు సైతం ఫ్రెండ్లీ పోలీసింగ్ ద్వారా భరోసా కల్పించే సేవలను అందించామని సీపీ వివరించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version