సంక్రాంతి రష్.. విశాఖ ట్రైన్‌లో ఫుట్‌బోర్డుపై నిలబడి ప్రయాణం

-

సంక్రాంతి పండుగ నేపథ్యంలో రాష్ట్రంలోని బస్టాండ్లు, రైల్వే స్టేషన్లలో ఫుల్ రష్ నెలకొంది. ఎక్కడా చూసినా ప్యాసింజర్స్ కనిపిస్తున్నారు. ప్లాట్ ఫామ్స్ మొత్తం ప్రయాణికుల రద్దీతో కిటకిటలాడుతున్నాయి. సొంతూర్లకు వెళ్లేవారికి ఓవైపు అదనపు చార్జీలు వసూలు చేస్తుండటం, మరోవైపు సీట్లు దొరకకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.


సంక్రాంతి రద్దీని దృష్టిలో పెట్టుకుని స్పెషల్ బస్సులు, స్పెషల్ ట్రైన్లు వేసినా సరిపోవడం లేదు. రద్దీకి తగినట్లు టీఎస్‌ఆర్టీసీ, ఏపీఎస్ ఆర్టీసీ, సౌత్ సెంట్రల్ రైల్వే సరిగా ట్రైన్లు నడిపించడం లేదని విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. మరోవైపు ప్రైవేట్ బస్సు సర్వీసులు అదనపు చార్జీలు వసూలు చేస్తుండటంతో మధ్యతరగతి ప్రజలు రైళ్లను ఆశ్రయిస్తున్నారు. దీంతో రద్దీ విపరీతంగా పెరిగిపోయింది. ఫలితంగా కొందరు యువకులు సికింద్రాబాద్‌-విశాఖ రైల్లో ఫుట్‌బోర్డ్‌పై నిలబడి ప్రయాణం చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version