కాంగ్రెస్ ఎమ్మెల్యే దానం నాగేందర్ యూటర్న్ తీసుకున్నాడు. రేసింగ్ కేసుపై కేటీఆర్ కు మద్దతుగా మాట్లాడిన దానం నాగేందర్.. ఇప్పుడు…రివర్స్ అయ్యాడు. నేను ఏది మాట్లాడినా కూడా సెన్సేషన్ అవుతుందని… ఈ కార్ రేసు వల్ల హైదరాబాద్ ఇమేజ్ పెరిగిందనే నేను చెబుతున్నానని తెలిపారు. కానీ అవినీతి కాలేదని నేను చెప్పలేదని బాంబ్ పేల్చారు. మూసి పై కంటి తుడుపు చర్యల్లాగా బీజేపీ వాళ్లు ఒక్కరోజు మూసి నిద్ర చేశారని ఫైర్ అయ్యారు.
వారు నిద్ర చేయడానికి వెళ్లే ముందే AC లు పెట్టించుకుని పడుకున్నారని చురకలు అంటించారు. వారి ఇళ్ళల్లో చేసిన జొన్న రెట్టేలు తినకుండా.. కిషన్ రెడ్డి బయట నుండి ఇడ్లీలు తెప్పించుకుని తిన్నాడని సెటైర్లు పేల్చారు. నేను ఫైటర్ ను.. ఉప ఎన్నికను బయపడనన్నారు. నేను ఎప్పుడో జరిగిన అంశం పై స్టేట్మెంట్ ఇచ్చాను..హైడ్రా పై ఓ ఇంటర్వ్యూ లో మాట్లాడానని తెలిపారు.
దానిని కొంతమంది మీడియా వాళ్ళు చెడుగా ప్రచారం చేస్తున్నారని ఆగ్రహించారు. నేనేమీ కేటీఆర్ కి క్లీన్ సర్టిఫికెట్ ఇవ్వలేదు..ఈ కార్ రేస్ పెట్టినప్పుడు కేటీఆర్ నా సలహా తీసుకున్నారని గుర్తు చేశారు. హైదరాబాద్ కాస్ట్ ఆఫ్ లివింగ్ తక్కువగా ఉందని.. ఇక్కడికి కొన్ని సంస్థలు వచ్చి సెట్టిల్ అయ్యాయన్నారు. హైదరాబాద్ సేఫెస్ట్ సిటి కాబట్టి ముంబై కి వెళ్ళే ఇన్వెస్టర్లు ఇక్కడి కి వస్తున్నారని పేర్కొన్నారు. ప్రభుత్వం ఆలోచించి హైడ్రా పై మరోసారి ఆలోచన చేయాలని కోరుతున్నానన్నారు.