75వ రిపబ్లిక్ డేకు ముఖ్యఅతిథిగా ఇండోనేషియా అధ్యక్షుడు

-

భారతదేశంలో రాజ్యాంగం అమలులోకి వచ్చి 75 సంవత్సరాలు పూర్తయ్యాయి. ఈ క్రమంలో 2025 జనవరి 26వ తేదీన నిర్వహించే గణతంత్ర వేడుకలకు ముఖ్య అతిథిగా ఇండోనేషియా అధ్యక్షుడు ప్రబోవో సుబియాంటో రానున్నట్లు సమాచారం. 73ఏళ్ల మాజీ ఆర్మీ జనరల్ సుబియాంటో 2024 అక్టోబర్‌లో ఇండోనేషియా అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన విషయం తెలిసిందే.

భారతదేశం ప్రతిఏటా గణతంత్ర దినోత్సవానికి ఇతర దేశాలకు చెందిన అధ్యక్షులు, ప్రధానులను ముఖ్యఅథితులుగా పిలుస్తూ వస్తున్నది. ఈ క్రమంలోనే ఇండోనేషియా అధ్యక్షుడికి ఈసారి కేంద్ర విదేశాంగ శాఖ ఆహ్వానం పంపినట్లు తెలుస్తోంది. సుబియాంటో భారత పర్యటనలో భాగంగా ఇరుదేశాల సంబంధాలపై ప్రధాని నరేంద్ర మోడీతో విస్తృత చర్చలు జరిపే అవకాశం ఉన్నట్లు టాక్. కాగా, దీనిపై అధికారిక ప్రకటన ఇంకా వెలువడలేదు.

Read more RELATED
Recommended to you

Exit mobile version