“సుకీభవ” అంటున్న హైదరాబాద్ పోలీస్..!

-

ఇప్పుడు ఎక్కడ చూసినా అయ్యయ్యో వద్దమ్మా…పక్కన టీ కొట్టు పెట్టాను. అనే మ్యూజిక్ ఏ వినిపిస్తోంది. ఓ టీవి యాడ్ ను హైదరాబాద్ కు చెందిన టిక్ టాకర్ ఇలా పాడి వైరల్ అయ్యాడు. దాంతో ఎక్కడ చూసినా ఇదే మ్యూజిక్ వినిపిస్తోంది. అయితే తాజాగా ఈ వైరల్ వీడియో కు సంబంధించిన డైలాగులను హైదరాబాద్ పోలీసులు సైతం వాడుకున్నారు. హైదరాబాద్ పోలీసులు ప్రజలకు నేరాల పట్ల మోసాల పట్ల సోషల్ మీడియా ద్వారా అవగాహన గలిగిస్తున్న సంగతి తెలిసిందే.ఈ నేపథ్యంలోనే సుఖీభవ కు సంబందించిన మీమ్ ను వాడుకున్నారు. మీరు గిఫ్ట్ లు గెలుచుకున్నారు అని లింక్ ఓపెన్ చేయాలని ఏమైనా మెసేజ్ లు వస్తే తెరవకూడదు అని పేర్కొన్నారు. అయ్యయ్యో వద్దమ్మా అనే క్యాప్షన్ ను ఆ ఫోటోకు ఇచ్చారు. ఇక హైదరాబాద్ పోలీసులు చేసిన ఈ పోస్ట్ కు సుకీభవ అంటూ నెటిజన్లు మెసేజ్ లు పెడుతున్నారు. అంతే కాకుండా ప్రజలకు అర్థం అయ్యే రీతిలో హైదరాబాద్ పోలీసులు చేస్తున్న ప్రచారం పై కూడా ప్రశంసలు కురిపిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version